దారుణం.. భర్తను చంపి, పిల్లలముందే దళిత మహిళపై అత్యాచారం.. నిందుతులెవరో తెలిసినా...

Published : Mar 18, 2022, 11:01 AM IST
దారుణం.. భర్తను చంపి, పిల్లలముందే దళిత మహిళపై అత్యాచారం.. నిందుతులెవరో తెలిసినా...

సారాంశం

జైపూర్ లో దారుణ ఘటన చోటు చేసుకుంది. పిల్లల కళ్లెదుటే తండ్రిని చంపి, తల్లి మీద అత్యాచారానికి ఒడిగట్టారు దుర్మార్గులు. ఈ ఘటనలో బాధితురాలు దళితసామాజిక వర్గానికి చెందింది కావడం.. నిందితులు అగ్రకులస్తులు కావడం, పోలీసులు ఇంకా అరెస్ట్ చేయకపోవడం చర్చనీయాంశంగా మారింది. 

జైపూర్ : దేశంలో మహిళలపై అఘాయిత్యాలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి.womanలపై లైంగిక దాడులకు పాల్పడినవారిని కఠినంగా శిక్షిస్తున్నప్పటికీ  మార్పు కనిపించడం లేదు. మృగాళ్ళు రెచ్చిపోతున్నారు. తాజాగా సభ్య సమాజం తలదించుకునే ఓ అమానవీయ ఘటన rajasthanలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే… రాజస్థాన్ లోని  ధోల్ పూర్ లో ఓ దళిత మహిళ..  తన భర్త,  పిల్లలతో కలిసి పొలం నుండి ఇంటికి తిరిగి వస్తోంది. ఈ క్రమంలో కొందరు దుండగులు వారిని అడ్డగించి.. సదరు మహిళ husbandను తుపాకీతో కాల్చి చంపారు.

ఆ తర్వాత బాధితురాలిని ఆమె పిల్లలను gunతో బెదిరించి ఆమెపై సామూహిక లైంగికదాడికి పాల్పడ్డారు. అనంతరం దుండగులు అక్కడి నుంచి పరారయ్యారు. దీంతో నిస్సహాయ స్థితిలో ఉన్న బాధితురాలు చివరకు పోలీసులను ఆశ్రయించింది. ఆమె ఫిర్యాదుపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను పట్టుకున్నారు. వారంతా బాధిత మహిళ గ్రామానికి చెందిన వారని వెల్లడించారు. నిందితులను లాలూ ఠాగూర్, mohit thakor,  సచిన్ ఠాకూర్ లుగా పోలీసులు గుర్తించారు.  కాగా,  ఈ కేసులో ఇప్పటివరకు ఎవరినీ అరెస్టు చేయలేదని పోలీసులు చెప్పడం గమనార్హం. 

ఇదిలా ఉండగా, తమిళనాడులో పదేళ్ల బాలికమీద 99యేళ్ల వృద్ధుడు molestationకి పాల్పడ్డాడు. మూడేళ్ల తరువాత ఈ కేసులో miscreantకి పదిహేనేళ్ల Imprisonment విధిస్తూ కోర్టు తీర్పునిచ్చిది. దీంతో పాటు రూ. 5,000 జరిమానా విధించింది. ఘటన జరిగిన సమయానికి ఆ కీచకుడిని 99 యేళ్లు.. అవును మీరు సరిగానే చదివారు.. 99యేళ్ల వయసులో తన ఇంట్లో అద్దెకు ఉంటున్న ఐదో తరగతి బాలిక మీద లైంగిక వేధింపులకు పాల్పడ్డాడో ఆ దుర్మార్గుడు.

ఈ నీచుడు Headmasterగా పనిచేసి రిటైర్ అయ్యాడు. ఇప్పుడు 102యేళ్ల వయసు ఉన్న ఆ ముసలోడికి తిరువళ్లూరు మహిళా కోర్టు 15 ఏళ్ల జైలు శిక్ష (10 ఏళ్ల కఠిన కారాగార శిక్షతో సహా) రూ. 5,000 జరిమానా విధించింది. జూలై 2018లో, జిల్లాలోని ఆల్ మహిళా పోలీస్ స్టేషన్ (AWPS) అప్పటికి 99 సంవత్సరాల వయస్సు గల కె. పరశురామన్‌ అనే ఈ కీచకుడిపై కేసు నమోదు అయ్యింది.

విశ్రాంత ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు పరశురామన్ తన నివాసప్రాంతంలో వరుసగా ఐదు ఇళ్లు నిర్మించి.. అద్దెకు ఇచ్చాడు. 2018లో కేసును దర్యాప్తు చేసిన ఇన్‌స్పెక్టర్ లత తెలిపిన వివరాల ప్రకారం, బాలిక కుటుంబం ఘటనకు రెండేళ్ల క్రితం అతడి ఇంట్లో అద్దెకు దిగింది. ఈ క్రమంలోనే ఆ వృద్ధుడి కన్ను బాలిక మీద పడింది. తరచుగా ఆమెను దగ్గరికి పిలిచి వేధించేవాడు.. ఆ తరువాత అదే ఏడాది జూలై 6న వారి పదేళ్ల బాలిక కడుపునొప్పితో విలవిలలాడుతూ తల్లిదండ్రులకు ఫిర్యాదు చేసింది. కడుపునొప్పి ఎందుకు వస్తుంది అంటూ తల్లిదండ్రులు ఆరా తీయగా..  పక్కింటి వృద్ధుడు తన మీద చేసిన అఘాయిత్యాన్ని తెలిపింది. లైంగిక దాడికి పాల్పడ్డాడని బాలిక వెల్లడించింది.

దీంతో షాక్ అయిన తల్లిదండ్రులు వెంటనే పోలీస్ స్టేషన్ కు చేరుకున్నారు. వారి ఫిర్యాదు మేరకు పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆ నీచుడు అంగీకరించాడు. దీంతో లైంగిక వేధింపుల ఆరోపణలపై అతన్ని అరెస్టు చేసి జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. ఘటన జరిగిన దాదాపు మూడున్నర సంవత్సరాల తరువాత, పరశురామన్ దోషిగా నిర్ధారిస్తూ.. 15 సంవత్సరాల జైలుశిక్ష (10 సంవత్సరాల కఠిన కారాగార శిక్షతో సహా) రూ. 5,000 జరిమానా విధిస్తూ కోర్టు తీర్పు వెలువరించింది. ప్రస్తుతం అతన్ని పుఝల్ జైలులో ఉంచారు. బాధితురాలికి రూ. 45,000 నష్టపరిహారం చెల్లించాలని కోర్టు తీర్పునిచ్చింది.

PREV
click me!

Recommended Stories

DAIS : ఐశ్వర్యారాయ్ కూతురు చదివే ధీరూభాయ్ అంబానీ స్కూల్ ఫీజు ఎంత?
ఆకాష్, అనంత్ అంబానీలు తెలుసు... మరి ఎవరీ జై అన్మోల్ అంబానీ?