ఛీ ఛీ...పదేళ్ల బాలికపై 102యేళ్ల వృద్ధుడు అత్యాచారం.. 15యేళ్ల జైలు శిక్ష విధించిన కోర్టు..

Published : Mar 18, 2022, 10:32 AM IST
ఛీ ఛీ...పదేళ్ల బాలికపై 102యేళ్ల వృద్ధుడు అత్యాచారం.. 15యేళ్ల జైలు శిక్ష విధించిన కోర్టు..

సారాంశం

సభ్యసమాజం తలదించుకునే అత్యంత హేయమైన ఘటనలో 102యేళ్ల ఓ ముసలోడికి కోర్టు పదిహేనేళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు నిచ్చింది. పదేళ్ల బాలిక మీద మూడేళ్ల క్రితం ఈ నీచుడు అత్యాచారానికి ఒడి గట్టాడు. అతను రిటైర్డ్ హెడ్మాస్టర్ కూడా. 

చెన్నై : ఆడపిల్లలు కనిపిస్తే చాలు కాటికి కాలు చాపిన ముసలాడు కూడా అత్యాచారానికి పాల్పడుతున్నాడు. ఇలాంటి అతి దారుణమైన, హేయమైన, అత్యంత నీచమైన ఘటన 2018లో తమిళనాడులో చోటు చేసుకుంది. అప్పుడే పుట్టిన పసికందునుంచి పండు ముదుసలి వరకు ఆడది అయితే చాలు కామంతో రెచ్చిపోయే ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. పదేళ్ల బాలికమీద 99యేళ్ల వృద్ధుడు molestationకి పాల్పడ్డాడు. మూడేళ్ల తరువాత ఈ కేసులో miscreantకి పదిహేనేళ్ల Imprisonment విధిస్తూ కోర్టు తీర్పునిచ్చిది. దీంతో పాటు రూ. 5,000 జరిమానా విధించింది. ఘటన జరిగిన సమయానికి ఆ కీచకుడిని 99 యేళ్లు.. అవును మీరు సరిగానే చదివారు.. 99యేళ్ల వయసులో తన ఇంట్లో అద్దెకు ఉంటున్న ఐదో తరగతి బాలిక మీద లైంగిక వేధింపులకు పాల్పడ్డాడో ఆ దుర్మార్గుడు.

ఈ నీచుడు Headmasterగా పనిచేసి రిటైర్ అయ్యాడు. ఇప్పుడు 102యేళ్ల వయసు ఉన్న ఆ ముసలోడికి తిరువళ్లూరు మహిళా కోర్టు 15 ఏళ్ల జైలు శిక్ష (10 ఏళ్ల కఠిన కారాగార శిక్షతో సహా) రూ. 5,000 జరిమానా విధించింది. జూలై 2018లో, జిల్లాలోని ఆల్ మహిళా పోలీస్ స్టేషన్ (AWPS) అప్పటికి 99 సంవత్సరాల వయస్సు గల కె. పరశురామన్‌ అనే ఈ కీచకుడిపై కేసు నమోదు అయ్యింది.

విశ్రాంత ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు పరశురామన్ తన నివాసప్రాంతంలో వరుసగా ఐదు ఇళ్లు నిర్మించి.. అద్దెకు ఇచ్చాడు. 2018లో కేసును దర్యాప్తు చేసిన ఇన్‌స్పెక్టర్ లత తెలిపిన వివరాల ప్రకారం, బాలిక కుటుంబం ఘటనకు రెండేళ్ల క్రితం అతడి ఇంట్లో అద్దెకు దిగింది. ఈ క్రమంలోనే ఆ వృద్ధుడి కన్ను బాలిక మీద పడింది. తరచుగా ఆమెను దగ్గరికి పిలిచి లైంగికంగా వేధించేవాడు. ఆచిన్నారికి ఏం చేయాలో తెలిసేది కాదు. ఆ తరువాత అదే ఏడాది జూలై 6న వారి పదేళ్ల బాలిక కడుపునొప్పితో విలవిలలాడుతూ తల్లిదండ్రులకు ఫిర్యాదు చేసింది. కడుపునొప్పి ఎందుకు వస్తుంది అంటూ తల్లిదండ్రులు ఆరా తీయగా..  పక్కింటి వృద్ధుడు తన మీద చేసిన అఘాయిత్యాన్ని తెలిపింది. లైంగిక దాడికి పాల్పడ్డాడని బాలిక వెల్లడించింది.

దీంతో షాక్ అయిన తల్లిదండ్రులు వెంటనే పోలీస్ స్టేషన్ కు చేరుకున్నారు. వారి ఫిర్యాదు మేరకు పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆ నీచుడు అంగీకరించాడు. దీంతో లైంగిక వేధింపుల ఆరోపణలపై అతన్ని అరెస్టు చేసి జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. ఘటన జరిగిన దాదాపు మూడున్నర సంవత్సరాల తరువాత, పరశురామన్ దోషిగా నిర్ధారిస్తూ.. 15 సంవత్సరాల జైలుశిక్ష (10 సంవత్సరాల కఠిన కారాగార శిక్షతో సహా) రూ. 5,000 జరిమానా విధిస్తూ కోర్టు తీర్పు వెలువరించింది. ప్రస్తుతం అతన్ని పుఝల్ జైలులో ఉంచారు. బాధితురాలికి రూ. 45,000 నష్టపరిహారం చెల్లించాలని కోర్టు తీర్పునిచ్చింది.

(లైంగిక వేధింపులకు సంబంధించిన కేసులపై సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం బాధితురాలి గుర్తింపు ఆమె గోప్యతను కాపాడేందుకు వివరాలు బహిర్గతం చేయలేదు)

PREV
click me!

Recommended Stories

అసెంబ్లీలో సీఎం విజయ్సంచలన నిర్ణయం | Vijay Powerful Speech in Assembly | Asianet News Telugu
CM Vijay Powerful Speech in Assembly: అసెంబ్లీ లో స్పీచ్ అదరగొట్టిన సీఎం విజయ్| Asianet News Telugu