యూపీలో దారుణం.. దళిత ప్రభుత్వాధికారి, అతని భార్య గొంతుకోసి చంపిన దుండగులు...

By AN TeluguFirst Published Nov 30, 2021, 8:14 AM IST
Highlights
ఆదివారం అర్థరాత్రి కొందరు గుర్తుతెలియని దుండగులు దంపతుల ఇంట్లోకి చొరబడ్డారని, వారిద్దరినీ sharp-edged weaponsతో గొంతు కోసి చంపి వెళ్లిపోయారని తెలుస్తోందని ఆర్య తెలిపారు. కాగా,  సోమవారం ఉదయం బాధితుల ఇరుగుపొరుగు ఈ విషయాన్ని గమనించి, పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులకు ఈ జంట హత్యలు జరిగినట్లు తెలిసింది.

లక్నో: uttarpradesh లో దారుణం చోటు చేసుకుంది.  ఓ 55 ఏళ్ల dalit government officialని, అతని భార్యను కిరాతకంగా murder చేశారు. సోమవారం ఉదయం అజంగఢ్ గ్రామంలోని వారి ఇంట్లో వారిద్దరూ శవాలుగా కనిపించారు. వారిని  పదునైన ఆయుధాలతో slashing their throats చేసి హత్య చేసినట్టుగా..  పోలీసులు చెబుతున్నారు.

హతుడు నజీనా (55) ఉత్తర్ ప్రదేశ్ లోని మౌ జిల్లాలోని కన్సాలిడేషన్ డిపార్ట్‌మెంట్‌లో "లేఖ్‌పాల్" అంటే రెవెన్యూ రికార్డ్ కీపర్ గా పనిచేస్తున్నాడు. అతడిని, అతని భార్య నగీనా దేవి (52)ని ఆదివారం అర్థరాత్రి తిథౌపూర్‌లోని తమ గ్రామంలోని తమ నివాసంలో నిద్రిస్తున్నప్పుడు ఈ హత్య జరిగింది. ఈ విషయాన్ని జిల్లాలోని తర్వాన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అజంగఢ్ పోలీసు సూపరింటెండెంట్ అనురాగ్ ఆర్య తెలిపారు.

ఆదివారం అర్థరాత్రి కొందరు గుర్తుతెలియని దుండగులు దంపతుల ఇంట్లోకి చొరబడ్డారని, వారిద్దరినీ sharp-edged weaponsతో గొంతు కోసి చంపి వెళ్లిపోయారని తెలుస్తోందని ఆర్య తెలిపారు. కాగా,  సోమవారం ఉదయం బాధితుల ఇరుగుపొరుగు ఈ విషయాన్ని గమనించి, పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులకు ఈ జంట హత్యలు జరిగినట్లు తెలిసింది.

సమాచారం అందుకున్న వెంటనే హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు డాగ్ స్క్వాడ్, వేలిముద్రల నిపుణులతో సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం తరలించినట్లు ఎస్పీ తెలిపారు. చనిపోయిన నగీనా ముగ్గురు సోదరులలో పెద్దవాడు. ఇతరిని ముగ్గురు కుమార్తెలు ఉన్నారని, వారిలో ఒకరికి వివాహం అయిందని పోలీసులు తెలిపారు.

Omicron : జబల్ పుర్ లో అధికారులను కంగారు పెట్టిన బోట్స్ వానా మహిళ.. చివరికి..

బుధవారం రాత్రి ప్రయాగ్‌రాజ్ జిల్లాలోని ఫఫమౌ పోలీస్ స్టేషన్ పరిధిలోని గోహ్రీ వద్ద షెడ్యూల్డ్ కులాల కుటుంబానికి చెందిన నలుగురు సభ్యులను వారి ఊర్లో వారింట్లోనే హత్య చేసిన కొద్ది రోజుల్లోనే అజంగఢ్ జిల్లాలో దళిత జంట జంట హత్య జరగడం కలకలం రేపుతోంది. 

బాధితుల్లో 50 ఏళ్ల వ్యక్తి, అతని భార్య, 45, వారి 16 ఏళ్ల కుమార్తె, 10 ఏళ్ల కుమారుడు ఉన్నారు. ఈ హత్యలకు కారణం భూవివాదాలేనని వినిపిస్తున్నాయి. హత్య చేయబడ్డ కుటుంబానికి వారి పొరుగున ఉన్న కుటుంబానికి మధ్య జరిగిన వివాదమే ఈ దారుణానికి దారి తీసింది. బాధితులతో గొడవ పడ్డ కుటుంబం అప్పర్ కాస్ట్ వారని తెలుస్తోంది. భూవివాదమే హత్యకు కారణం అని బాధిత కుటుంబ సభ్యుల బంధువులు ఆరోపించారు. 

కాగా, దళిత దంపతుల జంట హత్యలపై బీఎస్పీ అధ్యక్షురాలు మాయావతి తీవ్రంగా స్పందించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తక్షణమే తనిఖీ చేయాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. "ప్రయాగ్‌రాజ్ లో హత్య జరిగిన కొద్ది రోజులకే అజంగఢ్ జిల్లాలో దళిత దంపతుల గొంతు కోసి హత్య చేయడం అత్యంత దిగ్భ్రాంతికరమైన, బాధాకరమైన, అభిశంసనీయమైన సంఘటన. ప్రభుత్వం దళితులపై ఇలాంటి అఘాయిత్యాలను వెంటనే ఆపాలి. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి. ' అని బీఎస్పీ అధ్యక్షురాలు ట్వీట్‌లో పేర్కొన్నారు.
 

click me!