కోవిడ్ 19 : పీఎం-కేర్స్ ఫండ్ కు దలైలామా సాయం

Published : Apr 27, 2021, 05:01 PM IST
కోవిడ్ 19 : పీఎం-కేర్స్ ఫండ్ కు దలైలామా  సాయం

సారాంశం

కోవిడ్ 19 భయంతో అల్లాడుతున్న భారత్ కు సాయం చేసేందుకు ప్రపంచ దేశాలు ముందుకు వస్తున్నాయి. కరోనా నిర్మూలనకు దేశం చేస్తున్న ప్రయత్నాలకు టిబెటన్ ఆధ్యాత్మిక గురువు దలైలామా మద్దతుగా నిలిచారు. పీఎం-కేర్స్ పండ్ కు సహకరించాలని నిర్ణయించారు.

ఈ సందర్భంగా మహమ్మారి విస్తరణను అడ్డుకునేందుకు చేస్తున్న ప్రయత్నాలను దలైలామా ప్రశంసించారు. ముఖ్యంగా ఫ్రంట్‌లైన్‌లో పనిచేస్తున్న వారి కృషిని ఆయన అభినందించారు.

భారతదేశంతో సహా ప్రపంచవ్యాప్తంగా కరోనా వరుస సవాళ్లను ఆందోళనతో గమనిస్తూనే ఉన్నానంటూ దలైలామా ఆవేదన వ్యక్తం చేశారు. ఈ భయంకరమైన కరోనా సునామీలో తోటి భారతీయ సోదర, సోదరీమణులకు తన సంఘీభావంగా పీఎం కేర్స్‌ ఫండ్‌కు  విరాళం ఇవ్వమని దలైలామా ట్రస్టును కోరానని ఆయన చెప్పారు.

ఈ మహమ్మారి ముప్పు త్వరలోనే ముగిసి పోవాలని ఆయన కోరుకున్నారు. మరోవైపు దేశంలో రోజుకు మూడు లక్షలకు తగ్గకుండా కేసులు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో మంగళవారం నాటికి 3,23,144  మంది కొత్తగా కారణం బారినపడ్డారు.

దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,76,36,307కు పెరిగింది. అయితే జాతీయ రికవరీ రేటు 82.54  శాతంగా ఉందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించిన సంగతి తెలిసిందే.

PREV
click me!

Recommended Stories

Cigarette Price: 20 రూపాయ‌లున్న సిగ‌రెట్ ధ‌ర ఫిబ్ర‌వ‌రి త‌ర్వాత ఎంత కానుందో తెలుసా.?
8th Pay Commission : మినిమం శాలరీనే రూ.18,000 నుండి రూ.51,000 పెంపు.. ఈ స్థాయిలో జీతాలు పెరుగుతాయా..?