సైరస్ మిస్త్రీ మృతి : ప్రమాద సమయంలో అతివేగంతో కారు నడిపింది ఆమెనట..!

By Bukka SumabalaFirst Published Sep 5, 2022, 7:14 AM IST
Highlights

ప్రమాద సమయంలో టాటాసన్స్ మాజీ చైర్మన్ సైరస్ మిస్త్రీ కారును ఓ మహిళ నడిపినట్లు సమాచారం. ఆమె ప్రముఖ గైనకాలజిస్ట్ అనహిత పండోలే.

ముంబై : టాటా సన్స్ మాజీ చైర్మన్ సైరస్ మిస్త్రీ రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందిన ఘటన దేశంలో విషాదం రేపింది. ఆయన అకాల మరణం పట్ల ప్రధాని నరేంద్ర మోడీతో పాటు ప్రఖ్యాత రాజకీయ, పారిశ్రామిక ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అయితే ఈ ప్రమాదానికి గల కారణాలను పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. మిస్త్రీ ప్రయాణించిన మెర్సిడెస్ కారును ముంబైకి చెందిన అనహిత పండోలే (55) అనే ప్రముఖ గైనకాలజిస్ట్ నడిపినట్లు పోలీసులు వెల్లడించారు. అహ్మదాబాద్ నుంచి బయలుదేరి ముంబైకి వెళుతుండగా అతి వేగంగా ప్రయాణిస్తున్న వీరి కారు మరో వాహనాన్ని రాంగ్ సైడ్ నుంచి ఓవర్టేక్  చేసేందుకు ప్రయత్నించడంతో ప్రమాదానికి గురైనట్లు ప్రాథమికంగా తెలుస్తోందని పోలీసులు పేర్కొన్నారు.

ఈ ప్రమాదంలో మిస్త్రీతో పాటు మరో వ్యక్తి ప్రాణాలు కోల్పోగా.. ఇద్దరు గాయాలతో బయటపడ్డారని పోలీసులు తెలిపారు. ప్రమాద సమయంలో మిస్త్రి ప్రయాణిస్తున్న వాహనం 120 కిలోమీటర్ల కన్నా అధిక వేగంతో వస్తోందని.. ఈ ప్రమాదంలో ముందు సీట్లో కూర్చున్న అనహిత పండోలే (55), ఆమె భర్త డారియస్ పండోలే (60) గాయాలతో బయటపడ్డారు. వెనక సీట్లో కూర్చున్న  టాటా స్సన్స్ మాజీ చైర్మన్ Cyrus mistry, డారియల్ సోదరుడు జహంగీర్ పండోలే ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులు వివరించారు.

టాటా సన్స్‌ మాజీ ఛైర్మన్‌ సైరస్‌ మిస్త్రీ మృతిపై సమగ్ర విచారణకు మహారాష్ట్ర సర్కారు ఆదేశం

కారు పై పట్టు కోల్పోయి…
ఈ ప్రమాదం గురించి అక్కడే రోడ్డు పక్కన గ్యారేజ్ లో పనిచేస్తున్న ఓ ప్రత్యక్ష సాక్షి కథనం ప్రకారం.. అతను ఓ మరాఠీ టీవీ ఛానల్ వాళ్ళతో మాట్లాడుతూ… ‘ఈ కారును ఓ మహిళ నడిపారు. మరో వాహనాన్ని (ఎడమవైపు నుంచి) ఓవర్టేక్ చేసేందుకు ప్రయత్నించగా..  కంట్రోల్ పోయి పక్కనే ఉన్న డివైడర్ను ఢీకొట్టారు’ అని వివరించారు. అయితే, పది నిమిషాల్లోనే సహాయం అందడం వల్ల ఇద్దరిని కార్లోంచి బయటకి లాగి అంబులెన్స్లో ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు కానీ ఈ ఘటనలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు.. అన్నారు.

దేవేంద్ర ఫడ్నవీస్ ఏమన్నారంటే…
ఈ ఘటనపై మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మిస్త్రీ అకాల మరణం తనను షాక్ కు గురి చేసిందని పేర్కొన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించిన ఆయన ఈ ఘటనపై సమగ్ర విచారణకు ఆదేశించినట్లు తెలిపారు. ఈ విషయం గురించి డీజీపీతో మాట్లాడానని ట్విట్టర్లో పేర్కొన్నారు. 

కాగా,  ముంబ‌యి సమీపంలోని పాల్ఘర్‌లో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో టాటా గ్రూప్ మాజీ చైర్మన్, పారిశ్రామికవేత్త సైరస్ మిస్త్రీ మరణించిన విషయం తెలిసిందే.  ప్రమాదం తర్వాత, మిస్త్రీని ఆసుపత్రికి తీసుకెళ్లారు. అప్పటికే ఆయన చనిపోయినట్లు అక్కడి వైద్యులు ప్రకటించారు. కారు డ్రైవర్‌తో సహా అతనితో పాటు ప్రయాణిస్తున్న మరో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. వారు గుజరాత్‌లోని మరో ఆసుపత్రిలో ప్రాణాల‌తో పోరాడుతున్నార‌ని స‌మాచారం. 

మిస్త్రీ మృతి ప్రపంచ వాణిజ్య, పారిశ్రామిక రంగానికి తీరని లోటు అని ప్రధాని నరేంద్ర మోడీ సంతాపం తెలిపారు. "శ్రీ సైరస్ మిస్త్రీ అకాల మరణం దిగ్భ్రాంతికరం. ఆయన భారతదేశ ఆర్థిక పరాక్రమాన్ని విశ్వసించిన మంచి వ్యాపారవేత్త. ఆయన మరణం వాణిజ్య, పారిశ్రామిక ప్రపంచానికి తీరని లోటు. ఆయన కుటుంబ సభ్యులకు, స్నేహితులకు సానుభూతి తెలియజేస్తున్నాను. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను’’ అని ఆయన కుటుంబ సభ్యులకు, స్నేహితులకు సంతాపాన్ని తెలియజేస్తూ ప్రధాని మోడీ ట్వీట్ 

click me!