కాంగ్రెస్ ఖుషీ.. మధ్యప్రదేశ్‌లో చౌహాన్ ప్రభుత్వంపై జ్యోతిరాదిత్య సింధియా విధేయుల విమర్శలు

Published : Sep 05, 2022, 05:02 AM IST
కాంగ్రెస్ ఖుషీ.. మధ్యప్రదేశ్‌లో చౌహాన్ ప్రభుత్వంపై జ్యోతిరాదిత్య సింధియా విధేయుల విమర్శలు

సారాంశం

మధ్యప్రదేశ్ పరిణామాలపై కాంగ్రెస్ పార్టీకి కొంత ఉపశమనం కల్పిస్తున్నది. జ్యోతిరాధిత్య సిందియాతో బీజేపీకిలోకి మారిన మాజీ కాంగ్రెస్ నేతలు ప్రస్తుతం శివరాజ్ సింగ్ చౌన్ విమర్శలు చేస్తున్నారు.  

భోపాల్: మధ్యప్రదేశ్‌ బీజేపీ ప్రభుత్వంలో ముసలం మొదలైనట్టు తెలుస్తున్నది. జ్యోతిరాదిత్య సింధియా వర్గీయులు కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి చేరిన తర్వాత కమల్‌నాథ్ సర్కారును కూలిపోయిన సంగతి తెలిసిందే. జ్యోతిరాదిత్య సింధియా వర్గీయులు అప్పుడు కమల్ సర్కారును ఇరకాటంలో పెట్టారు. ఇప్పుడు శివరాజ్ సింగ్ చౌహాన్‌ ప్రభుత్వాన్ని కూడా ఇరకాటంలో పెడుతున్నట్టు అర్థం అవుతున్నది. ఎందుకంటే సింధియాతోపాటు బీజేపీలో చేరిన పలువురు మాజీ కాంగ్రెస్ నేతలు ఇప్పుడు చౌహాన్ ప్రభుత్వంపై బహిరంగంగా విమర్శలు చేస్తున్నారు.

ఇద్దరు సింధియా విధేయులు అధికారులు, పోలీసులను టార్గెట్ చేసి వమరశలు గుప్పించారు. ఇందులో రాష్ట్ర సీఎస్ ఐఎస్ బెయిన్స్ కూడా ఉండటం గమనార్హం. రాష్ట్ర మంత్రి మహేంద్ర సిసోడియా బహిరంగంగా తన ఆగ్రహాన్ని వ్యక్తం చేయగానే.. బ్రిజేంద్ర సింగ్ యాదవ్  రాష్ట్ర స్టేట్ కో ఆపరేటివ్ సొసైటీ కమిషనర్‌కు, కలెక్టర్‌కు లేఖ రాశారు.

విధానసభ మాజీ స్పీకర్ సీతాసరన్ శర్మకూడా నర్మదాపురం జిల్లాలో రోడ్డెక్కారు. ప్రజల నుంచి కరెంట్ బిల్లు అంటూ ఎలక్ట్రిసిటీ బిల్లును రికవరీ చేస్తూ ప్రజలను వేధిస్తున్నదని ఆరోపించారు. మరో ఎమ్మెల్యే నారాయణ్ త్రిపాఠి ఇటీవలే సీఎం ఓ లేఖరాసిన ఆ వ్యక్తి ఇప్పుడు చిత్రకూట్ నుంచి మార్చ్ చేస్తామని బెదిరించారు.  ష్ట్ర పంచాయత్, రూరల్ డెవలప్‌మెంట్ డిపార్ట్‌మెంట్ శాఖ మంత్రి మహేంద్ర సిసోడియా రాష్ట్ర సీఎస్
నియంతలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్ర ప్రజా ఆరోగ్య ఇంజినీరింగ్ శాఖ మంత్రి బ్రిజేంద్ర సింగ్
యాదవ్.. కో ఆపరేటివ్ శాఖలో నియామకాలపై అసంతృప్తిగా ఉన్నారని వివరించరు. స్థానిక అధికారుల
నియామకంపై ఆగ్రహంతో ఆయన అశోక్ నగర్ జిల్లా కలెక్టర్‌తోనూ గొడవపడ్డాడు.

వారిద్దరూ కాంగ్రెస్‌లో ఉన్నప్పుడు కూడా ఇవే టాక్టిక్స్ ప్లే చేశారని కాంగ్రెస్ పేర్కొంది. వారి నేత సహా ఆ
గ్యాంగ్ నేతలు అంతా పక్కా కమర్షియల్ పొలిటీషియన్ అని తెలిపింది.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

ఏమిటీ..! కేవలం పశువుల పేడతో రూ.500 కోట్ల లాభమా..!!
Sabarimala Makarajyothi: మకర జ్యోతి దర్శనానికి శబరిమలకు పోటెత్తిన భక్తులు | Asianet News Telugu