దూసుకొస్తున్న యాస్ తుఫాన్: బెంగాల్, జార్ఖండ్, ఒడిశా, బీహార్ రాష్ట్రాల్లో హైఅలెర్ట్

By narsimha lodeFirst Published May 25, 2021, 9:53 AM IST
Highlights

యాస్ తుపాన్ దూసుకువస్తోంది. ఈ తుఫాన్  పలు రాష్ట్రాలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. దీంతో  ఆయా రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణశాఖాధికారులు హెచ్చరించారు. 
 

న్యూఢిల్లీ: యాస్ తుపాన్ దూసుకువస్తోంది. ఈ తుఫాన్  పలు రాష్ట్రాలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. దీంతో  ఆయా రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణశాఖాధికారులు హెచ్చరించారు. ఒడిశా, పశ్చిమ బెంగాల్ , బీహార్, జార్ఖండ్ రాష్ట్రాల్లో  హై అలెర్ట్ జారీ చేశారు. ఎల్లో  బెంగాల్, ఒడిశా రాష్ట్రాల్లో ఎల్లో అలెర్ట్ జారీ చేసింది ఐఎండీ.యాస్ తుఫాన్ ఉత్తర వాయువ్య దిశగా కదులుతుంది. రానున్న 12 గంటల్లో తీవ్రమైన తుఫాన్ గా మారే అవకాశం ఉందని ఐఎండీ ప్రకటించింది. 

also read:దూసుకొస్తున్న యాస్ : ఆ రాష్ట్రాలపై తీవ్ర ప్రభావం, భారీ వర్షాలు

ఉత్తర్ ఒడిశాలోని బాలాసోర్ సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు. ఈ సమయంలో  155 కి.మీ. నుండి 165 కి.మీ వేగంతో  గాలులు వీచే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది. ఈ నెల 26వ తేదీన యాస్ తుఫాన్ తీరం తాకే అవకాశం  ఉందని అధికారులు ప్రకటించారు.కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా యాస్ తుఫాన్ పై ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ లో సోమవారం నాడు మాట్లాడారు.  తుఫాన్ కారణంగా తీసుకోవాల్సిన చర్యలపై ఆయన చర్చించారు. ఇప్పటికే ఎన్డీఆర్ఎప్ సిబ్బందితో పాటు నేవీ, ఆర్మీని ఆయా రాష్ట్రాల్లో మోహరించారు. తుఫాన్ కారణంగా ఇవాళ ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో కొన్ని చోట్ల భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

టౌటే తరహలోనే యాస్ తుఫాన్ కూడ తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని వాతావరణ శాఖాధికారులు అంచనా వేస్తున్నారు.  గత ఏడాదిలో బెంగాల్ రాష్ట్రంలో అంఫాన్ తుఫాన్ ఆ రాష్ట్రాన్ని తీవ్ర ప్రభావాన్ని చూపింది. ఆ తుఫాన్ సమయంలో 240 కి.మీ వేగంగా గాలులు వీచాయి. దీని ప్రభావంతో సుమారు 80 మంది మరణించారు. 

click me!