మోచా సైక్లోన్ ఎఫెక్ట్: 29 మంది మృతి.. పెద్ద సంఖ్య‌లో ఆస్తి న‌ష్టం.. భారీ వ‌ర్షం, ఈదురు గాలులు

By Mahesh RajamoniFirst Published May 16, 2023, 11:27 AM IST
Highlights

Cyclone Mocha: మోచా తుఫాను భీభ‌త్సం కొన‌సాగుతోంది. కోల్ క‌తా స‌హా బెంగాల్ లోని ప‌లు జిల్లాల్లో సోమవారం సాయంత్రం నుంచి బ‌ల‌మైన ఈదురుగాలులు వీస్తున్నాయి. న‌గ‌రంలో సాయంత్రం గంట‌ల పాటు ట్రాఫిక్ జామ్ ఏర్ప‌డింది. సాయంత్రం 5.41 గంటలకు మొదటి ఈదురుగాలులు వీచగా, గరిష్ఠంగా గంటకు 81 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి. పలు చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి.
 

Cyclone Mocha-Heavy rain, winds: సూపర్ సైక్లోన్ మోచా ఆదివారం మయన్మార్-బంగ్లాదేశ్ తీరం వెంబడి తీరం దాటింది.  ఇది కేటగిరీ -5 తుఫానుకు సమానంగా బలపడి ఆగ్నేయ తీరప్రాంతాలకు విస్తృతమైన నష్టాన్ని కలిగించింది. లోతట్టు ప్రాంతాలలో ఐదు లక్షల మందికి పైగా ప్రజలను ఖాళీ చేయవలసి వచ్చింది. బంగాళాఖాతంలో బీభత్సం సృష్టించిన మోచా తుఫాను కారణంగా పశ్చిమ మయన్మార్ కు సంబంధాలు నెమ్మదిగా పునరుద్ధరించబడటంతో మృతుల సంఖ్య సోమవారం నాటికి 29కి చేరుకుంది. బంగ్లాదేశ్ లో ఎలాంటి ప్రాణనష్టం జరగనప్పటికీ కాక్స్ బజార్ లోని వందలాది తాత్కాలిక షెల్టర్లను ధ్వంసం చేశారు. భార‌త్ లోని చాలా ప్రాంతాల‌పై మోచా తుఫాను ప్ర‌భావం కనిపిస్తోంది.

మయన్మార్ లో 29కి చేరిన మృతుల సంఖ్య

బంగాళాఖాతంలో బీభత్సం సృష్టించిన మోచా తుఫాను కారణంగా పశ్చిమ మయన్మార్ లో దారుణ ప‌రిస్థితులు క‌నిపిస్తున్నాయి. తుఫాను ప్ర‌భావంతో మృతుల సంఖ్య సోమవారం నాటికి  29కి పెరిగింది. మోచా తుఫాను బంగ్లాదేశ్ లోని కాక్స్ బజార్, మయన్మార్ లోని సిట్వే మధ్య గంటకు 195 కిలోమీటర్ల (120 మైళ్ళు) వేగంతో గాలులు వీస్తూ తీరం దాటింది. తుఫాను ఆదివారం అర్థరాత్రి దాటింది, బంగ్లాదేశ్లో దాదాపు పది లక్షల మంది రోహింగ్యాలు నివసిస్తున్న శరణార్థి శిబిరాలను తీవ్ర ప్ర‌భావం ప‌డింది. అయితే, అక్కడ ఎటువంటి మరణాలు సంభవించలేదని అధికారులు తెలిపారు. సిట్వేకు వాయవ్యంగా ఉన్న ఖౌంగ్ డోకే కర్ గ్రామంలో 24 మంది చనిపోయారని, జుంటా నుంచి ప్రతీకార చర్యలకు భయపడి పేరు వెల్లడించాలని రోహింగ్యా శిబిరం నాయకుడు ఒకరు తెలిపిన‌ట్టు ఏఎఫ్పీ నివేదించింది. రోహింగ్యా గ్రామాలు, ఐడీపీ శిబిరాలు ఉన్న లోతట్టు ప్రాంతాల్లో పలువురు గల్లంతైనట్లు తెలిపారు. మయన్మార్ లో కనీసం ఐదుగురు మరణించారనీ, కొంతమంది నివాసితులు గాయపడ్డారని మిలటరీ జుంటా ఇంతకు ముందు ఒక ప్రకటనలో తెలిపింది. 

పెద్ద సంఖ్య‌లో ఆస్తుల న‌ష్టం 

దేశవ్యాప్తంగా 860 ఇళ్లు, 14 ఆసుపత్రులు, క్లినిక్ దెబ్బతిన్నాయి. దాదాపు 1,50,000 మంది నివసిస్తున్న రఖైన్ రాష్ట్ర రాజధాని సిట్వేతో సోమవారం కమ్యూనికేషన్లు ఇంకా అస్తవ్యస్తంగా ఉన్నాయని సైక్లోన్ ట్రాకర్లు తెలిపారు. చెట్లు, పైలాన్లు, విద్యుత్ కేబుళ్లతో నిండిన రహదారిలో ఎత్తైన ప్రదేశాల్లో ఆశ్రయం పొందిన వందలాది మంది నగరానికి తిరిగి వస్తున్నారని రిపోర్టులు పేర్కొంటున్నాయి. న‌గ‌రంలో కనీసం ఐదుగురు మరణించారనీ, సుమారు 25 మంది గాయపడ్డారని స్థానిక రెస్క్యూ వర్కర్ కో లిన్ పిన్  తెలిపిన‌ట్టు ఏఎఫ్పీ నివేదించింది. 

మిజోరంలో 'మోచా' తుఫానుతో 230 ఇళ్తు దెబ్బ‌తిన్నాయి..

మిజోరంలోని పలు ప్రాంతాల్లో సూపర్ సైక్లోన్ 'మోచా' బీభత్సం సృష్టించడంతో 236 ఇళ్లు, ఎనిమిది శరణార్థుల శిబిరాలు ధ్వంసమయ్యాయి. ఆదివారం వీచిన ఈదురుగాలులకు 50కి పైగా గ్రామాల్లోని 5,749 మంది ప్రభావితమయ్యారు. అయితే ఎలాంటి ప్రాణనష్టం జరిగినట్లు సమాచారం లేదు.

కోల్ క‌తాలో 

బంగ్లాదేశ్, మయన్మార్ తీరాలకు సమీపంలో ఆదివారం దిగిన 'మోచా' అనే భయంకరమైన తుఫాను రాకతో పశ్చిమ బెంగాల్లోని కోల్ క‌తా నగరంలో తీవ్రమైన వర్షాలు కురిశాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన మోచా తుఫాను ప్రభావం పశ్చిమబెంగాల్ లోని పలు ప్రాంతాల్లో కనిపిస్తోంది. సోమవారం సాయంత్రం 4 గంటల సమయంలో కోల్ కతాలో 60 నుంచి 80 వేగంతో గాలులు వీచాయి. భారీ వర్షానికి చెట్లు విరిగి రోడ్లపై పడ్డాయి. పశ్చిమబెంగాల్ లోని మరికొన్ని జిల్లాల్లోనూ వర్షాలు కురుస్తున్నాయి. మోచా తుఫానుకు సంబంధించి వాతావరణ శాఖ ఇప్పటికే ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.

click me!