స్నేహితుల అరాచకత్వం.. 12 ఏళ్ల బాలుడిని తల పగులగొట్టి, గొంతు నుమిలి హత్య.. అనంతరం ప్లాస్టిక్ సంచిలో కుక్కి..

Published : May 16, 2023, 11:14 AM IST
స్నేహితుల అరాచకత్వం.. 12 ఏళ్ల బాలుడిని తల పగులగొట్టి, గొంతు నుమిలి హత్య.. అనంతరం ప్లాస్టిక్ సంచిలో కుక్కి..

సారాంశం

ముగ్గురు మైనర్లు కలిసి స్నేహితుడైన 12 ఏళ్ల బాలుడిని దారుణంగా హత్య చేశారు. అనంతరం డెడ్ బాడీని ప్లాస్టిక్ సంచిలో ఓ నిర్మానుష్య ప్రదేశంలో వదిలేసి వెళ్లిపోయారు. ఈ ఘటనలో ముగ్గురు బాలులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

మధ్యప్రదేశ్ లోని సియోని జిల్లాలో దారుణం వెలుగులోకి వచ్చింది. ఓ గ్రామంలో ముగ్గురు మైనర్ బాలురు తమ 12 ఏళ్ల స్నేహితుడిని సైకిల్ గొలుసుతో గొంతు నులిమారు. అనంతరం రాయితో తలను పగులగొట్టి, గొంతు కోశారు. తరువాత శవాన్ని పాలిథిన్ సంచిలో నింపి ఇంటి సమీపంలోని గులకరాళ్ల కుప్పపై పడేశారు. రక్తపు మరకలున్న బ్యాగును ఓ మహిళ గుర్తించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది.

కర్ణాటకలో బీజేపీ, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఘర్షణ.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు..

ఈ ఘటనకు పాత తగాదాలే ఈ దారుణ హత్యకు కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. ముగ్గురు బాలురను అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపరిచి 14 రోజుల పాటు కరెక్షనల్ హోంకు తరలించారు. బర్ఘాట్ పోలీస్ స్టేషన్ ఇన్స్ పెక్టర్ ప్రసన్న శర్మ ‘పీటీఐ’కి వెల్లడించిన వివరాల ప్రకారం.. 16, 14, 11 ఏళ్ల ముగ్గురు బాలులు ఆదివారం సియోని జిల్లా కేంద్రానికి 28 కిలోమీటర్ల దూరంలో ఉన్న మగర్కథా గ్రామంలోని నిర్మానుష్య ప్రదేశానికి పిలిచారు.

నా సింప్లిసిటీ చూసి ప్రధానికి అత్తనంటే ఎవరు నమ్మలేదు - సుధామూర్తి

బాధితుడు అక్కడికి చేరుకున్న తరువాత వారంతా దారుణంగా హతమార్చారు. అయితే సమీపంలో నివసిస్తున్న మహిళ చూడకుండా ఉండేందుకు ఆ ముగ్గురూ 12 ఏళ్ల బాలుడి మృతదేహాన్ని పాలిథిన్ సంచిలో నింపారు. తమ ఇంటి సమీపంలోని గులకరాళ్ల కుప్పపై పడేసి పరారయ్యారు. అయితే ఆ మహిళ ఆ ప్లాస్టిక్ సంచిని చూసింది. తరువాత పోలీసులకు సమాచారం అందించింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

PREV
click me!

Recommended Stories

Top 5 Dirtiest Railway Stations : దేశంలోనే అత్యంత మురికి రైల్వే స్టేషన్ ఏదో తెలుసా?
IT Jobs : ఇక TCS లో ఉద్యోగాలే ఉద్యోగాలు