
మునుపెప్పుడూ లేని విధంగా నడివేసవిలో ఈదురు గాలులతో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే చాలా ప్రాంతాల్లో కురిసిన ఆకాల వర్షాలు రైతన్నలకు తీవ్ర నష్టం కలిగించాయి. వేల ఎకరాల్లో పంట నష్టం జరిగింది. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా.. ఇతర రాష్ట్రాల్లో పరిస్థితి ఇలానే ఉంది. ఫలితంగా పంటలన్నీ వర్షార్పణమయ్యాయి. రైతులు ఆ బాధ నుండి తెరుకోకముందే.. తుఫాను రూపంలో మరో పిడుగు వచ్చిపడుతోంది.
రానున్న ఐదురోజుల్లో దేశంలో వాతావరణం ఇలా ఉండబోతుందని, వచ్చే వారంలో తూర్పు తీర రాష్ట్రాలకు తుఫాను ముప్పుపొంచి ఉందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. ఆగ్నేయ బంగాళాఖాతంలో తుపాను బలపడే అవకాశాలున్నట్లు ఐఎండీ అంచనా వేసింది.తత్ఫలితంగా కర్ణాటక, కోస్తాంధ్ర, తెలంగాణ, కేరళ, తమిళనాడు ప్రాంతాలతో ఐదే రోజుల పాటు భారీ నుంచి, అతి భారీ వర్షాలు పడతాయని అంచనా వేసింది. అదే సమయంలో మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లవద్దని హెచ్చరించింది
భారత వాతావరణ శాఖ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ్ మహపాత్ర ఢిల్లీలో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. వచ్చే ఐదురోజుల్లో తూర్పు తీర రాష్ట్రాలకు తుఫాను ముప్పుపొంచి ఉందని, మే 6, 2023 నాటికి ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడే అవకాశం ఉందని హెచ్చరించారు. వాయుగుండ ప్రభావంతో మరుసటి రోజు అదే ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని సూచించారు.
కాల గమనం మారుతుంది. చలికాలంలో తీవ్ర ఎండలు, నిండు వేసవిలో భారీ వర్షాలు. దీంతో చేతికొచ్చిన కాస్తా పంట కూడా నీటిమునిగింది. ఆ పరిస్థితి వర్ణననీతం.. రైతన్నలు లబోదిబోమంటున్నారు. అకాల వర్షాలకు మామిడి తీవ్రంగా దెబ్బ తిన్నది. ఇప్పటికే రైతుల పరిస్థితి దయానీయం.. ఈ వర్షాలతో దిచ్చుతోచని పరిస్థితిలో పడిపోయాడు.