వరదలతో అతలాకుతలం అవుతున్న చెన్నైవాసులకు క్రికెటర్ డేవిడ్ వార్నర్ అండగా నిలిచాడు.
న్యూఢిల్లీ: గత రెండు రోజులుగా నగరంలోని అనేక ప్రాంతాలను ప్రభావితం చేసిన చెన్నై వరదలపై స్టార్ ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ మంగళవారం ఆందోళన వ్యక్తం చేశారు. తన స్వదేశం తర్వాత భారత్ లో ఎక్కువ ఫాన్ ఫాలోయింగ్ ఉన్న వార్నర్, ఇన్‌స్టాగ్రామ్‌లో వరదల మీద పోస్ట్ పెట్టాడు.సహాయం చేయగల స్థితిలో ఉన్న ప్రతి ఒక్కరూ బయటకు రావాలని.. అవసరమైన మేరకు సహాయం అందించాలని విజ్ఞప్తి చేశాడు.
‘చెన్నైలోని అనేక ప్రాంతాలను వరదలు ప్రభావితం చేయడం నన్ను తీవ్ర ఆందోళనకు గురి చేసింది. ఈ ప్రకృతి విపత్తు వల్ల ప్రభావితమైన వారందరి గురించి నేను ఆలోచిస్తున్నాను. ప్రతి ఒక్కరూ సురక్షితంగా ఉండటం ముఖ్యం, అవసరమైతే ఎత్తైన ప్రదేశాలకు వెళ్లడానికి ప్రయత్నించండి. మీలో ఎవరైనా సహాయం చేయగల స్థితిలో ఉంటే, దయచేసి సహాయక చర్యలకు మద్దతు ఇవ్వడం లేదా అవసరమైన వారికి సహాయం అందించేలా ఆలోచించండి. ఎక్కడున్న ఒకరికొకరం మద్దతుగా నిలవాల్సి అవసరం ఉంది. మద్దతు ఇవ్వడానికి కలిసి రండి” అని వార్నర్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు.
Cyclone Michaung : మిచాంగ్ తుపాన్ పేరు ఎవరు పెట్టారు? ఎలా పిలవాలంటే...
తీవ్ర తుఫాను మిచాంగ్ కారణంగా చెన్నై చాలా నష్టాన్ని చవి చూస్తోంది. చెన్నై, దాని చుట్టుపక్కల జరిగిన సంఘటనలలో దాదాపు డజను మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. మిచాంగ్ తుఫాను తమిళనాడులోని ఉత్తర తీర ప్రాంతాలను చుట్టుముట్టడంతో నగరం, చుట్టుపక్కల జిల్లాలు సోమవారం ఎడతెరిపిలేని వర్షాలను ఎదుర్కొన్నాయి. గత రెండు రోజులుగా నగరంలో 45 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యింది. తుపాను సోమవారం రాత్రి చెన్నై తీరాన్ని దాటింది.