మరాఠీలోకి అడుగుపెట్టిన Asianet News .. దేవేంద్ర ఫడ్నవీస్ చేతుల మీదుగా గ్రాండ్ లాంచ్

By Siva Kodati  |  First Published Dec 5, 2023, 10:25 PM IST

దేశంలోని అతిపెద్ద డిజిటల్ మీడియా నెట్‌వర్క్స్‌లో ఒకటైన Asianetnews.com, Asianet News Media and Entertainment Private Limited (ANMEPL) మరాఠీలోనూ తన ఫ్లాట్‌ఫామ్‌ను ప్రారంభించింది. మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.


దేశంలోని అతిపెద్ద డిజిటల్ మీడియా నెట్‌వర్క్స్‌లో ఒకటైన Asianetnews.com, Asianet News Media and Entertainment Private Limited (ANMEPL) మరాఠీలోనూ తన ఫ్లాట్‌ఫామ్‌ను ప్రారంభించింది. మంగళవారం ముంబైలోని ప్రెస్‌క్లబ్‌లో ఈ కార్యక్రమం జరిగింది. మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాష్ట్ర జలవనరుల శాఖ కార్యదర్శి డాక్టర్ రామ్‌నాథ్ సోనావానే, నటుడు , దర్శకుడు ప్రవీణ్ దాబాస్, నటి ప్రీతి ఝాంగ్యానీ తదితరులు హాజరయ్యారు. 

Asianetnews.com ఇప్పటికే మలయాళం, కన్నడ, ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళం, బంగ్లా భాషల్లో అందుబాటులో ఉంది. మరాఠీ‌లోను అడుగుపెట్టడం ద్వారా గ్రూప్ డిజిటల్ న్యూస్ మీడియా పశ్చిమ రాష్ట్రాలకు సైతం విస్తరించినట్లయ్యింది. దాని పాదముద్రను జాతీయంగానూ, ప్రపంచవ్యాప్తంగా విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. Asianetnews.com బలమైన క్రెడిబిలిటీ, ప్రాంతీయ అంతర్దృష్టులు కంటెంట్‌ను బట్వాడా చేయడానికి వీలు కల్పిస్తుంది. Asianetnews.com మహారాష్ట్రలో కేంద్రీకృత వార్తలు, వీడియో కంటెంట్‌కు డెస్టినేషన్‌గా మారాలని లక్ష్యంగా పెట్టుకుంది. 

Latest Videos

undefined

ఈ సందర్భంగా దేవేంద్ర ఫడ్నవీస్ మాట్లాడుతూ.. Asianetnews వంటి నిజమైన న్యూస్ ప్రొవైడర్లు నకిలీ కంటెంట్‌ను అరికట్టాల్సిన అవసరం వుందన్నారు. ముఖ్యంగా ఏఐ ఆధారిత ఫ్లాట్‌ఫాంల వల్ల కలిగే ముప్పు గురించి డిప్యూటీ సీఎం నొక్కి చెప్పారు. డీప్ ఫేక్ వంటి ఇతర యాప్‌ల గురించి కూడా ఆయన హెచ్చరించారు. తప్పుడు సమాచార వ్యాప్తిని అరికట్టడానికి, మరాఠీ డయాస్పోరాకు విశ్వసనీయ వార్తలను అందించడంలో సమాజం అభిప్రాయాన్ని రూపొందించడంలో సహాయపడటానికి డిజిటల్ మీడియా పోషించాల్సిన పాత్రను ఫడ్నవీస్ హైలైట్ చేశారు. 

 

 

ఏషియానెట్ న్యూస్ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ రాజేష్ కల్రా మాట్లాడుతూ.. మరాఠీలో అడుగుపెట్టడం వెనుక వున్న ఆలోచన గురించి ప్రస్తావించారు. దేశంలో ఇంటర్నెట్‌ను అత్యధికంగా వినియోగించే మూడవ అతిపెద్ద రాష్ట్రం మహారాష్ట్ర అన్నారు. మరాఠీ దేశంలో కీలక భాషల్లో ఒకటి అని.. అందువల్ల ఏషియానెట్ ఇతర భాషల్లోకి విస్తరించాలని అనుకుంటున్నప్పుడు మరాఠీ ఏకగ్రీవంగా ఎంపికైందన్నారు. తాము మహారాష్ట్ర ప్రజలకు అత్యంత విశ్వసనీయమైన వార్తలను అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని రాజేష్ కల్రా తెలిపారు. అధిక నాణ్యత గల కంటెంట్‌ను వ్యాప్తి చేసే ఫ్లాట్‌ఫామ్‌ను అందిస్తామని ఆయన స్పష్టం చేశారు. 

ఏషియానెట్ న్యూస్ గ్రూప్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ నీరజ్ కోహ్లీ మాట్లాడుతూ.. తాము దేశంలోని 7 ఇతర భాషల్లో సాధించిన విజయం మరాఠీపై ప్రతిబింబిస్తుందన్నారు. మహారాష్ట్ర ప్రజలు మాపై వుంచిన విశ్వాసాన్ని నిలబెట్టుకుంటామని, తమ దృష్టి ఎల్లప్పుడూ ప్రేక్షకులకు అత్యంత సమగ్రమైన, తాజా, నిజాయితీతో కూడిన కవరేజీని అందించడంపైనే వుంటుందని నీరజ్ కోహ్లీ చెప్పారు. 

ఏషియానెట్ న్యూస్ గ్రూప్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ సమర్ధ్ శర్మ మాట్లాడుతూ.. ప్రపంచవ్యాప్తంగా వున్న మరాఠీ డయాస్పోరాకు స్ట్రెయిట్, బోల్డ్, రిలెంట్‌లెస్ న్యూస్ కవరేజీని అందించడానికి తాము ప్రయత్నిస్తామన్నారు. 24 గంటలూ పనిచేస్తున్న బలమైన జర్నలిస్టుల బృందం న్యూస్ బ్యూరో ఏషియానెట్ న్యూస్ మరాఠీని అత్యంత విశ్వసనీయ వార్తల మూలంగా స్థాపించడానికి సిద్దంగా వుందని సమర్ధ్ శర్మ తెలిపారు. మరాఠీ ఫ్లాట్‌ఫాం ప్రారంభం వెనుక సంస్థ లక్ష్యం, భావజాలం వుందన్నారు. 

AsianetNews.com దేశంలోని లీడింగ్ న్యూస్ పోర్టల్‌.  7 భాషల్లో 80 మిలియన్ల నెలవారీ క్రియాశీల వినియోగదారులను అందిస్తోంది. పెరుగుతున్న దాని పోర్ట్‌ఫోలియోకు మరాఠీ జోడించబడటం ద్వారా తన పాదముద్రను దేశం, ప్రపంచమంతటా విస్తరించడానికి సిద్ధంగా ఉంది. ఏషియానెట్ న్యూస్ నెట్‌వర్క్ (ఏఎన్ఎన్)లో  టీవీ ఛానెల్స్ (ఏషియానెట్ న్యూస్, ఏషియానెట్ సువర్ణా న్యూస్), ప్రింట్ పబ్లికేషన్ (కన్నడ ప్రభ), మ్యూజిక్ ఫ్లాట్‌ఫాం (IndigoMusic.com), 8 భాషలలో డిజిటల్ ఫ్లాట్‌ఫాంలు (AsianetNews.com and MyNation.com) వున్నాయి. 
 

click me!