ఫణి తుఫాన్: ఉన్నతాధికారులతో మోడీ అత్యవసర భేటీ

Published : May 02, 2019, 03:57 PM IST
ఫణి తుఫాన్: ఉన్నతాధికారులతో మోడీ అత్యవసర భేటీ

సారాంశం

ఫణి తుఫాన్‌పై  ప్రధానమంత్రి మోడీ గురువారం నాడు మోడీ ఉన్నతాధికారులతో  అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు.   

న్యూఢిల్లీ: ఫణి తుఫాన్‌పై  ప్రధానమంత్రి మోడీ గురువారం నాడు మోడీ ఉన్నతాధికారులతో  అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు. 

ఒడిశా రాష్ట్రంతో పాటు ఏపీలోని ఉత్తరాంధ్రపై ప్రభావం చూపే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించిన నేపథ్యంలో  మోడీ అధికారులతో ఈ విషయమై సమీక్ష నిర్వహించారు.

ఫణి తుఫాన్ ప్రభావానికి గురయ్యే రాష్ట్రాల్లో తీసుకొన్న ముందు జాగ్రత్తల గురించి అధికారులు మోడీకి వివరించారు.ఏ ప్రాంతంలో ఫణి తుఫాన్ తీరం దాటనుందనే విషయమై అధికారులు ప్రధానమంత్రికి తెలిపారు. ఫణి తుఫాన్ ప్రభావం గురించి ఐఎండీ డైరెక్టర్ మోడీకి  వివరించారు.

మరో వైపు ఈ సమావేశం తర్వాత  ఫని తుఫాన్ ప్రభావానికి గురయ్యే రాష్ట్రాల్లో పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ రాష్ట్రాలతో సమన్వయం చేసుకోవాలని మోడీ ఉన్నతాధికారులను ఆదేశించారు.తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలను చేపట్టాలన్నారు.
 

PREV
click me!

Recommended Stories

AI Smart Glasses : పోలీసుల చేతికి ఏఐ అస్త్రం.. ఈ మ్యాజిక్ గ్లాసెస్ నేరస్తులను ఎలా గుర్తిస్తాయి?
uttar Pradsh : ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో దేశంలోనే టాప్... ఏ రాష్ట్రమో తెలుసా?