సైన్యానికి కనిపించిన అడుగులు ‘యతి’వేనా: కన్‌ఫ్యూజన్‌లో సైంటిస్టులు

By Siva KodatiFirst Published May 2, 2019, 2:45 PM IST
Highlights

హిమాలయాల్లో భారత సైన్యానికి  కనిపించిన పాదముద్రల నేపథ్యంలో ‘యతి’ గురించి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. 

హిమాలయాల్లో భారత సైన్యానికి  కనిపించిన పాదముద్రల నేపథ్యంలో ‘యతి’ గురించి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. చిన్నాచితకా వ్యక్తులు దీనిని ప్రకటిస్తే ఎవరు పట్టించుకునేవారు కాదు.. కానీ ఏకంగా ఇండియన్ ఆర్మీ అఫీషియల్‌గా ట్వీట్ చేయడం శాస్త్రవేత్తలను ఆలోచింపచేస్తోంది.

ఈ క్రమంలో ‘యతి’ అడుగుజాడలపై శాస్త్రవేత్తలు, పరిశోధకులు తలో మాట చెబుతున్నారు. సైన్యం ప్రకటించినందున దీనిపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని బాంబే నేచురల్ హిస్టరీ సొసైటీ డైరెక్టర్ దీపక్ ఆప్టే అన్నారు.

ప్రకృతిలో అప్పుడప్పుడు ఇలాంటి వింత ఘటనలు చోటు చేసుకుంటాయని ఆయన తెలిపారు. కానీ బలమైన ఆధారాలు లభించేవరకకు వీటిని నిర్థారించడం సరికాదన్నారు. అయితే వీటిపై మరింత పరిశోధన, చర్చ జరగాల్సిన అవసరం మాత్రం ఉందని స్పష్టం చేశారు.

మరోవైపు కోతుల జాతిపై పరిశోధనలు జరుపుతున్న నేషనల్ ఇన్‌‌స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ స్టడీస్‌కు చెందిన ప్రొఫెసర్  అనింద్య సిన్హా మాట్లాడుతూ.. ఆర్మీ ప్రచురించిన ఫోటోల్లోని అడుగులు యతివి అనే వాదనతో ఏకీభవించలేనన్నారు.

హిమాలయాల్లో సంచరించచే గోధుమ రంగు ఎలుగుబంట్ల పాదముద్రలు అయ్యుండొచ్చని  ఆయన సందేహం వ్యక్తం చేశారు. అవి ఒక్కోసారి వెనుకక పాదాలతోనే నడుస్తాయయని ఆ క్రమంలో వాటి అడుగుల గుర్తులు ‘యతి’ పాదముద్రలను తలపిస్తాయని వివరించారు.

వీరితో పాటు మరికొందరు శాస్త్రవేత్తలు సైతం భారత సైన్యం సోషల్ మీడియాలో పెట్టిన పాదముద్రలు యతివి కాదని వాదిస్తున్నారు. ఒకే పాదంతో నడిచినట్లు అడుగులు ఉన్నాయని.. మరో పాదానికి చెందిన అడుగులు ఏమైనట్లు అని వారు ప్రశ్నిస్తున్నారు. 

click me!