ఏఐ ఆధారిత సిసిటీవీ సర్వైవలెన్స్ వ్యవస్థ ద్వారా అయోధ్య దేవాలయానికి తరచుగా వచ్చే భక్తులను గుర్తించనున్నారు.
రామ మందిర ప్రాణ ప్రతిష్ట రామాలయ ప్రారంభోత్సవానికి సంబంధించి అయోధ్య అంగరంగ వైభవంగా ముస్తాబయింది. జనవరి 22న అయోధ్యకు ఎనిమిది వేల మందికి ఆహ్వానాలు అందాయి. జనవరి 23వ తేదీ నుంచి అందరూ భక్తులకు రామాలయంలో ప్రవేశం ఉంటుంది.. రామాలయ భద్రత దృష్ట్యా అనేక జాగ్రత్తలు తీసుకున్నారు. కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. ఇందులో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది ఏఐ టెక్నాలజీ.
ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ ను ఉపయోగించి నిబంధనలను ఉల్లంఘించే వారిపై చర్యలు తీసుకోనున్నారు. ఎంహెచ్ఏ ఇన్ పుట్స్ ప్రకారం సెక్యూరిటీ బ్రీచ్ చేసిన వారిని గుర్తిస్తారు. 12,000 మంది ఉత్తర ప్రదేశ్ పోలీసులు అయోధ్య భద్రత చర్యల్లో మోహరించారు. ఎలాంటి భద్రతా ఉల్లంఘనలో జరగకుండా జాగ్రత్తలు తీసుకోనున్నారు.
అయోధ్యలో ఇటీవల ఇద్దరు ఉగ్రవాదులు పట్టుబడిన సంగతి తెలిసింది వీటిని దృష్టిలో ఉంచుకొని ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్సును ఉపయోగించి వేయికళ్లతో పర్యవేక్షించనున్నారు. రియల్ టైం మానిటరింగ్ ను చేసే ఇంటిగ్రేటెడ్ కంట్రోల్ రూమ్స్ ను ఏర్పాటు చేశారు. దీని కోసం ప్రసిద్ధ సెక్యూరిటీ ఏజెన్సీలను నియమించారు.
అయోధ్య లడ్డూల విక్రయంపై అమెజాన్ కు కేంద్రం నోటీసులు..
అయోధ్యలో మొత్తం పదివేల సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేశారు. 400 సీసీటీవీ కెమెరాలు ఒక దేవాలయంలోనే ఏర్పాటు చేశారు. దీంట్లో ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ ఉపయోగించి ఫేషియల్ రికగ్నైజేషన్ చేయనున్నారు. ఎల్లో జోన్ ను దాటిన వారిని.. ఫేషియల్ రికగ్నైజేషన్ ద్వారా గుర్తించనున్నారు.
ఏఐ ఆధారిత సిసిటీవీ సర్వయోలెన్స్ వ్యవస్థ ద్వారా అయోధ్య దేవాలయానికి తరచుగా వచ్చే భక్తులను గుర్తించనున్నారు. దీనితోపాటు ఆ భక్తులు దేవుడిని దర్శించుకోవడానికి మాత్రమే వస్తున్నారా? లేకపోతే ఎలాంటి ఉద్దేశంతో వస్తున్నారు అనేదానిపై నిఘా పెట్టి అవకాశముంది.