CTET 2021 Exam వాయిదా: త్వరలోనే పరీక్ష తేదీల ప్రకటన

Published : Dec 17, 2021, 10:53 AM ISTUpdated : Dec 17, 2021, 11:05 AM IST
CTET 2021  Exam వాయిదా: త్వరలోనే పరీక్ష తేదీల ప్రకటన

సారాంశం

సీ టెట్ పరీక్షలు వాయిదా వేస్తున్నట్టుగా సీబీఎస్ఈ ప్రకటించింది.సాంకేతిక సమస్యల కారణంగానే ఈ పరీక్షలను వాయిదా వేస్తున్నట్టుగా సీబీఎస్ఈ తెలిపింది. త్వరలోనే పరీక్షా తేదీలను వెల్లడిస్తామని సీబీఎస్ఈ ప్రకటించింది.

న్యూఢిల్లీ: CTET-2021 పరీక్షలను సీబీఎస్ఈ psot pone వేసింది. ఈ మేరకు సీబీఎస్ఈ ప్రకటన విడుదల చేసింది. Exam తేదీలను త్వరలోనే ప్రకటించనున్నట్టుగా సీబీఎస్ఈ తెలిపింది. సీటెట్ పరీక్షను డిసెంబర్ 16న మధ్యాహ్నం నిర్వహించాల్సి ఉంది. అయితే సాంకేతిక సమస్యల కారణంగా ఈ పరీక్షలను రద్దు చేసినట్టుగా సీబీఎస్ఈ తెలిపింది. సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ల్ (CTET-2021) తొలిసారిగా కంప్యూటర్ ఆధారిత మోడ్ లో నిర్వహిస్తున్నారు.కొందరు విద్యార్ధులు CTET-2021 మొదటి పేపర్ ను సాంకేతిక కారణాలతో రాయలేకపోయారు. దీంతో రెండో పేపర్ ను కూడా రద్దు చేయాల్సి వచ్చిందని Cbseప్రకటించింది. డిసెంబర్ 16, 17 తేదీల్లో నిర్వహించాల్సిన పరీక్షల తేదీలను తర్వాత ప్రకటించనున్నట్టుగా సీబీఎస్ఈ తెలిపింది.

పరీక్షలను సజావుగా నిర్వహించేందుకే నిర్ణీత షెడ్యూల్ పరీక్షలను వాయిదా వేసినట్టుగా సీబీఎస్ఈ ప్రకటించింది. ctet ;పేపర్ 1 కోసం ఉదయం తొమ్మిదిన్నర నుండి మధ్యాహ్నాం 12 గంటల వరకు , రెండో సెషన్ లో పేపర్ 2 లో మధ్యాహ్నం రెండున్నర గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు నిర్వహించాలని భావించారు.  కానీ సాంకేతిక సమస్యలతో ఈ పరీక్షలను వాయిదా వేశారు.  150 ప్రశ్నలకు అభ్యర్ధులు సమాధానాలు ఇవ్వాల్సి ఉంటుంది. కంప్యూటర్ ఆధారిత మోడ్ లో పరీక్షలను నిర్వహించనున్నారు. గతంలో కూడా పలు పరీక్షలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రద్దు చేయడమో, వాయిదా వేయడమో చేశాయి. ప్రధానంగా కరోనా కారణంగా టెన్త్, ఇంటర్తో పాటు పలు బోర్డుల పరీక్షలను ఆయా రాష్ట్రాలు , సీబీఎస్ఈ కూడా పరీక్షలను రద్దు చేశాయి. 

.

PREV
click me!

Recommended Stories

Census 2027: 30 లక్షల మంది సిబ్బంది, రూ. 11,718 కోట్లు.. ప్రపంచంలోనే అతిపెద్ద ఫీల్డ్ ఆపరేషన్‌గా జ‌న‌గ‌ణ‌న‌
Prada: ఈ చెప్పుల ధ‌ర అక్ష‌రాల రూ. 85 వేలు.. కొల్హాపురి కళాకారులతో ఇటాలియ‌న్ కంపెనీ ఒప్పందం