
Cryptocurrency: భారతదేశంలో ప్రైవేట్ క్రిప్టోకరెన్సీలపై పెట్టుబడులు పెట్టే వారిని భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) మరోసారి హెచ్చరించింది. పోస్ట్ మానిటరీ పాలసీ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో ఆర్‌బిఐ గవర్నర్ శక్తికాంత దాస్ మాట్లాడుతూ.. ప్రైవేట్ క్రిప్టోకరెన్సీలు.. దేశ స్థూల ఆర్థిక వ్యవస్థకు, ఆర్థిక స్థిరత్వానికి ముప్పు అని, తమ స్వంత పూచీతో పెట్టుబడి పెట్టే పెట్టుబడిదారులు నష్టాలను గుర్తుంచుకోవాలని హెచ్చరించారు.
ప్రైవేట్ క్రిప్టోకరెన్సీల వల్ల దేశ స్థూల ఆర్థిక వ్యవస్థ కి ముప్పు వాటిల్లుతుందని, ఆర్థిక ఆస్థిరత్వానికి సంబంధించిన సమస్యలు ఏర్పడుతాయని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ తెలిపారు. వీటివల్ల దేశ ఆర్థిక సుస్థిరతకు విఘాతం కలుగుతుందన్నారు. ఇవీ ఆర్బీఐ సామర్థ్యాన్ని దెబ్బతీస్తాయని వివరించారు. వీటిలో పెట్టుబడి పెట్టేవారు తమ స్వంత రిస్క్‌తోనే ఆ పని చేస్తున్నట్లు గుర్తుంచుకోవాలని కోరారు. అప్రమత్తంగా ఉండాలని పెట్టుబడిదారులను హెచ్చరించడం తన కర్తవ్యమని తెలిపారు.
క్రిప్టోకరెన్సీకి ఎటువంటి ఆధారాలు లేవని, వాటికి ఎటువంటి అంతర్లీన విలువ ఉండదని, అది కనీసం టులిప్ అయినా కాదన్నారు. 17వ శతాబ్దంలో టులిప్ మానియా నడిచిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. క్రిప్టో కర్సెన్సీ అనేది డిజిటల్ స్వభావం మాత్రమేననీ, సాధారణ రూపాయిలాగా పర్సులో లేదా జేబులో ఉందని తెలిపారు. డిజిటల్ రూపాయి, ప్రైవేట్ క్రిప్టోకరెన్సీల మధ్య వ్యత్యాసం ఏమిటంటే.. డిజిటల్ రూపాయి జారీ తరువాత RBI తెలుపుతుందని అన్నారు.
భారతదేశంలో 15 మిలియన్ల నుండి 20 మిలియన్ల క్రిప్టో పెట్టుబడిదారులు ఉన్నయని అంచనా. మొత్తం క్రిప్టో హోల్డింగ్‌లు ₹40,000 కోట్లు ($5.37 బిలియన్లు). భారతీయ క్రిప్టో మార్కెట్ పరిమాణంపై అధికారిక డేటా అందుబాటులో లేదు. జూన్ 2021 నాటికి భారతదేశంలో క్రిప్టో మార్కెట్ 641% వృద్ధి చెందిందని చైనాలిసిస్ అనే పరిశ్రమ పరిశోధన సంస్థ తెలిపింది.
ఇదిలావుండగా, ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ఫిబ్రవరి 1న పార్లమెంటులో 2022-23 ఆర్థిక సంవత్సరం బడ్జెట్ ప్రవేశపెడుతూ.. Bitcoin, Ethereum వంటి క్రిప్టోకరెన్సీల నుంచి వచ్చే లాభాలపై 30 శాతం పన్ను విధిస్తామని చెప్పారు. అలాగే.. 2023 నుంచి దేశంలో తొలి డిజిటల్ కరెన్సీని ఆర్బీఐ ప్రారంభిస్తుందని ప్రకటించిన విషయం విధితమే.
ఇదిలా ఉంటే.. అంతకుముందు.. రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా వడ్డీ రేట్లు మరో మారు యథాతథంగా కొనసాగించనున్నట్లు ప్రకటించింది. రెండు నెలలకు ఒకసారి చేసే మనీటరీ లివరేజ్ పాలసీపై రివ్యూ చేసిన ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ ఈ విషయాన్ని వెల్లడించారు. కరోనా ముప్పు కొనసాగుతున్న నేపథ్యంలో.. కీలక వడ్డీ రేట్లను యాథాతథంగా కొనసాగిస్తున్నట్లు తెలిపారు. రెపోరేటు 4 శాతం, రివర్స్ రెపోరేట్ 3.35 శాతంగా కొనసాగిస్తున్నట్లు వెల్లడించారు.
వడ్డీ రేట్లను యాథాతథంగా కొనసాగించడం ఇదే తొలిసారి కాదు. వరుసగా పదవసారి కీలక వడ్డీ రేట్లను కొనసాగించడం గమనార్హం.కరోనావైరస్ మహమ్మారి నేపథ్యంలో ఆర్‌బిఐ అల్ట్రా-లూజ్ మానిటరీ పాలసీని అవలంబించింది, తగినంత లిక్విడిటీతో ఆర్థిక వ్యవస్థను పెంచడానికి, ఇది చివరిసారిగా కీలక రేటును 4% కనిష్ట స్థాయికి తగ్గించింది.
2020 మే నుండి ఆ స్థాయిలో కొనసాగిస్తుంది. 2023 ఆర్థిక సంవత్సరానికి (FY23) భారతదేశ ఆర్థిక వృద్ధిని 7.8%గా గవర్నర్ అంచనా వేశారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు 9.2% వద్ద కొనసాగుతోంది. ఆశ్చర్యకరమైన చర్యలో, RBI కూడా రివర్స్ రెపో రేటుతో టింకర్ చేయలేదు, ఈ చర్య ద్రవ్యోల్బణ ఆందోళనల మధ్య పాలసీ సాధారణీకరణకు సమయం ఆసన్నమైందని వ్యాఖ్యాతలు మరియు విశ్లేషకులు విస్తృతంగా విశ్వసించారు.