సహ ఉద్యోగిని కాల్చి చంపి.. సీఆర్పీఎఫ్ ఎస్ఐ ఆత్మహత్య

Published : Jul 25, 2020, 07:37 AM IST
సహ ఉద్యోగిని కాల్చి చంపి.. సీఆర్పీఎఫ్ ఎస్ఐ ఆత్మహత్య

సారాంశం

సంఘటన స్థలంలో ఇద్దరు సీఆర్ పీఎఫ్ అధికారుల మృతదేహాలను కనుగొన్నారు. ఢిల్లీలోని పోలీసు ఉన్నతాధికారులు హుటాహుటిన సంఘటన స్థలానికి వచ్చారు.

తన తోటి ఉద్యోగిని తన తుపాకీతో కాల్చి చంపేశాడు. అనంతరం తనను తాను కూడా కాల్చుకున్నాడు.  ఒక సీఆర్పీఎఫ్ ఎస్ఐ ఇలా చేయడం అందరినీ షాకింగ్ కి గురిచేసింది. ఈ సంఘటన దేశ రాజధానిలో చోటుచేసుకోగా.. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ఢిల్లీలోని లోథి ఎస్టేట్ ప్రాంతంలో ఓ సీఆర్‌పీఎఫ్ సబ్ ఇన్ స్పెక్టరు తన సహ ఉద్యోగి అయిన ఇన్ స్పెక్టరును తన రివాల్వరుతో కాల్చి చంపాడు. అనంతరం ఎస్ఐ తానూ తుపాకీతో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. సంఘటన స్థలంలో ఇద్దరు సీఆర్ పీఎఫ్ అధికారుల మృతదేహాలను కనుగొన్నారు. ఢిల్లీలోని పోలీసు ఉన్నతాధికారులు హుటాహుటిన సంఘటన స్థలానికి వచ్చారు. 

ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించారు. శుక్రవారం అర్దరాత్రి జరిగిన ఈ కాల్పుల ఘటన ఢిల్లీలో పోలీసులు అప్రమత్తమయ్యారు. వీరి చావులకు గల కారణం ఏంటో తెలియరాలేదు. ఎస్ఐ ఇలాంటి ఘాతుకానికి ఎందుకు పాల్పడ్డాడు అనే విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకోని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

PREV
click me!

Recommended Stories

Aadhaar Card New Rules : 2026లో ఆధార్ అప్‌డేట్ చేయాలంటే ఈ పత్రాలు తప్పనిసరి !
Jobs : కేవలం జనవరి ఒక్క నెలలోనే.. లక్ష ఉద్యోగాల భర్తీకి సర్కార్ సిద్దం