మూడు నగరాల్లో పర్యటన: కరోనా వ్యాక్సిన్‌‌ అభివృద్ధి ప్రక్రియపై మోడీ సమీక్ష

By Siva KodatiFirst Published Nov 28, 2020, 8:59 PM IST
Highlights

కరోనా వ్యాక్సిన్ అభివృద్ధి, తయారీ ప్రక్రియపై విస్తృతమైన సమీక్ష నిర్వహించడానికి ప్రధాని నరేంద్ర మోడీ శనివారం మూడు నగరాల్లో పర్యటన చేపట్టారు. అహ్మదాబాద్‌లోని జైడస్ బయోటెక్ పార్క్, హైదరాబాద్‌లోని భారత్ బయోటెక్, పూణేలోని సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియాలను ఆయన సందర్శించారు.

కరోనా వ్యాక్సిన్ అభివృద్ధి, తయారీ ప్రక్రియపై విస్తృతమైన సమీక్ష నిర్వహించడానికి ప్రధాని నరేంద్ర మోడీ శనివారం మూడు నగరాల్లో పర్యటన చేపట్టారు. అహ్మదాబాద్‌లోని జైడస్ బయోటెక్ పార్క్, హైదరాబాద్‌లోని భారత్ బయోటెక్, పూణేలోని సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియాలను ఆయన సందర్శించారు.

టీకా అభివృద్ధి ప్రయాణంలో ఈ క్లిష్టమైన దశలో ధైర్యాన్ని పెంచడానికి, వారి ప్రయత్నాలను వేగవంతం చేయడానికి ప్రధానమంత్రి తమను ముఖాముఖిగా కలుసుకున్నారని శాస్త్రవేత్తలు ఆనందం వ్యక్తం చేశారు.

భారతదేశ స్వదేశీ వ్యాక్సిన్‌ ఇంత వేగంగా అభివృద్ధి చెందిందని ప్రధాని గర్వం వ్యక్తం చేశారు. వ్యాక్సిన్ అభివృద్ధి ప్రయాణంలో దేశం సైన్స్ సూత్రాలను ఎలా అనుసరిస్తోందనే దానిపై ప్రధాని మాట్లాడారు. అలాగే టీకా పంపిణీ ప్రక్రియను మరింత మెరుగ్గా నిర్వహించడానికి మోడీ వారి నుంచి సూచనలు స్వీకరించారు. వ్యాక్సిన్లను ఆరోగ్యం కోసం మాత్రమే కాకుండా.. వైరస్‌కు వ్యతిరేకంగా సమిష్టి పోరాటంలో ఇతర దేశాలకు సహాయం చేయడం భారతదేశం విధి అని ప్రధాని నొక్కి చెప్పారు. 

దేశం తన నియంత్రణ ప్రక్రియను ఎలా మెరుగుపరుస్తుందనే దానిపై స్వేచ్ఛాయుతమైన ,స్పష్టమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేయాలని మోడీ శాస్త్రవేత్తలను కోరారు. ఈ సందర్భంగా COVID-19 తో పోరాడటానికి తాము డ్రగ్స్‌ను ఎలా అభివృద్ధి చేస్తున్నారనే దానిపై శాస్త్రవేత్తలు ఒక ప్రజంటేషన్ సమర్పించారు.

శనివారం ఉదయం గుజరాత్‌లోని అహ్మదాబాద్ చేరుకున్న మోడీ అక్కడి జైడస్ క్యాడిలా బయోటెక్ పార్కును సందర్శించారు. ఈ సంస్థ అభివృద్ధి చేసిన జైకోవ్ డీ టీకా ప్రయోగాలను గురించి శాస్త్రవేత్తలను అడిగి తెలుసుకున్నారు. ఈ ప్రయాణంలో వారికి భారత ప్రభుత్వం వారితో చురుగ్గా పనిచేస్తోందన్నారు. 

అనంతరం హైదరాబాద్‌లోని భారత్ బయోటెక్‌ను సందర్శించిన ప్రధాని.. ఈ సంస్థ కోవిడ్-19 వ్యాక్సిన్ తయారీని వేగవంతం చేసేందుకు ఐసీఎంఆర్‌తో కలిసి పనిచేస్తోందన్నారు. కోవిడ్-19 నిరోధానికి స్వదేశీ వ్యాక్సిన్ తయారీలో సాధించిన పురోగతిని శాస్త్రవేత్తలు తనకు వివరించారని తెలిపారు. ఈ వ్యాక్సిన్ ట్రయల్స్‌లో ఇప్పటి వరకు సాధించిన ప్రగతి పట్ల సంతృప్తి వ్యక్తం చేస్తూ శాస్త్రవేత్తలను అభినందించారు. 

సీరం కేంద్రాన్ని పరిశీలించిన అనంతరం ప్రధాని మోదీ ట్వీట్‌ చేశారు. సీరం బృందంతో మంచి చర్చలు జరిగాయనీ, ఇప్పటివరకు జరిగిన కృషి, భవిష్యత్‌ పురోగతిపై వివరాలను వారు షేర్‌ చేశారని మోదీ పేర్కొన్నారు.

click me!