ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్ ఇంట సీఆర్‌పీఆఫ్ జవాన్ ఆత్మహత్య.. ఏకే 47తో రెండు రౌండ్లు కాల్చుకుని..!

By Mahesh KFirst Published Feb 4, 2023, 12:38 PM IST
Highlights

ఢిల్లీలోని ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ) డైరెక్టర్ ఇంట ఓ సీఆర్‌పీఎఫ్ జవాన్ ఆత్మహత్య చేసుకున్నారు. తన సర్వీస్ రైఫిల్ ఏకే 47తో రెండు రౌండ్లు కాల్చుకుని మరణించారు. ఈ ఘటన శుక్రవారం సాయంత్రం ఢిల్లీలో జరిగింది.
 

న్యూఢిల్లీ: జవాన్ ఒంటి నిండా ధైర్యాన్ని, ఆత్మస్థైర్యాన్ని కలిగి ఉంటాడు. అందుకే అతను ఆత్మహత్య చేసుకున్నాడు అనే వార్త వినగానే అందరూ సాధారణంగానే ఉలిక్కిపడతారు. తాజాగా, ఢిల్లీలో సీఆర్‌పీఎఫ్ జవాన్ ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ) డైరెక్టర్ ఇంట ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన శుక్రవారం సాయంత్రం జరిగింది.

సెంట్రల్ రిజర్వ్ పోలీసు ఫోర్స్  (సీఆర్‌పీఎఫ్) అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్, 53 ఏళ్ల రాజ్బిర్ కుమార్ ఐబీ డైరెక్టర్ ఇంటిలో బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఆయన పోస్టింగ్ ఐబీ డైరెక్టర్ ఇంటిలో పడింది. ఐబీ డైరెక్టర్ నివాసం ఢిల్లీలోని తుగ్లక్ రోడ్ ఏరియాలో ఉన్నది.

రాజ్బిర్ కుమార్ గత కొన్ని రోజులుగా సెలవుల్లో ఉన్నారు. మళ్లీ శుక్రవారమే విధుల్లోకి వచ్చి చేరారు. ఇంతలోనే తీవ్ర నిర్ణయం తీసుకుని ప్రాణాలనే పోగొట్టుకున్నారు. తన సర్వీస్ రైఫిల్ ఏకే 47తోనే శుక్రవారం సాయంత్రం 4 గంటల ప్రాంతంలో రెండు రౌండ్లు షూట్ చేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు.

Also Read: సిఆర్‌పిఎఫ్, బీహార్‌ పోలీసుల జాయింట్ ఆపరేషన్.. భారీ మొత్తంలో పట్టుబట్ట ఆయుధాలు, మందుగుండు సామాగ్రి..

స్పాట్‌లో ఎలాంటి సూసైడ్ నోట్ లభించలేదు. రాజ్బిర్ కుమార్ ఆత్మహత్యను అతని కుటుంబానికి తెలియజేశారు. సీఆర్‌పీసీలోని 174 సెక్షన్‌ల కింద కేసు నమోదైంది. దర్యాప్తు మొదలైంది.

click me!