కశ్మీర్ ఇష్యూ: ఆజాద్‌పై క్రిమినల్ కేసు

First Published Jun 29, 2018, 4:02 PM IST
Highlights

కశ్మీర్ ఇష్యూ: ఆజాద్‌పై క్రిమినల్ కేసు

సైనికుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బ తీసేలా మాట్లాడినందుకు గాను కాంగ్రెస్ సీనియర్ నేతలు గులాంనబీ ఆజాద్, సైపుద్దీన్ సోజ్‌లపై క్రిమినల్ కేసు నమోదైంది. భారత సైన్యం ఉగ్రవాదుల కంటే సామాన్యులనే ఎక్కువగా చంపుతోందని.. నలుగురు ఉగ్రవాదులను హతమార్చేందుకు 20 మంది సామాన్య పౌరులను చంపుతున్నారంటూ ఆజాద్ వ్యాఖ్యానించగా.. కాశ్మీర్‌కు స్వాతంత్ర్యం ప్రకటించాలంటూ పాక్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ చేసిన వ్యాఖ్యలకు మద్ధతు పలుకుతూ సైపుద్దీన్ సోజ్ మాట్లాడటంపై అన్ని వర్గాల నుంచి నిరసన వ్యక్తమైంది.. భద్రతా దళాల నైతిక స్థైర్యాన్ని దెబ్బతీసేలా మాట్లాడినందుకు గాను బేషరుతుగా క్షమాపణలు చెప్పాలని కొందరు డిమాండ్ చేశారు.

వీరిద్దరిపై చర్యలు తీసుకోవాలంటూ సీనియర్ న్యాయవాది శశిభూషణ్ పటియాలా కోర్టులో పిటిషన్ వేశారు. సెక్షన్ 124, 120బీ, 505(1) కింద కేసు నమోదు చేయాలని కోరారు. 

click me!