
గుజరాత్‌లో ఇటీవల ముగిసిన అసెంబ్లీ ఎన్నికల్లో కొత్తగా ఎన్నికైన 40 మంది శాసనసభ్యులపై క్రిమినల్ కేసులు నమోదయ్యాయని, 29 మంది గెలిచిన అభ్యర్థులపై తీవ్రమైన నేరారోపణలు ఉన్నాయి. ఈ విషయాన్ని అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) నివేదిక ఆదివారం వెల్లడించింది.
“182 మంది గెలిచిన అభ్యర్థులలో 40 (22%) మంది అభ్యర్థులు తమపై క్రిమినల్ కేసులు ఉన్నాయని, 29 (16%) మంది గెలిచిన అభ్యర్థులు తమపై తీవ్రమైన క్రిమినల్ కేసులు ఉన్నాయని తెలిపారు’’ అని ఏడీఆర్ నివేదిక పేర్కొంది. 2017లో గెలిచిన 47 మంది ఎమ్మెల్యేలపై క్రిమినల్ కేసులు ఉన్నాయి. అలాంటి కేసులు ఉన్న ఎమ్మెల్యేల సంఖ్య 2022 ఎన్నికల్లో 40 (22%)కి పడిపోయింది. 2017లో గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో అధికారంలోకి ఎన్నికైన 182 మంది ఎమ్మెల్యేలలో 33 (18%) ఎమ్మెల్యేలు తీవ్రమైన క్రిమినల్ కేసులను ప్రకటించారు. అది కూడా ఈసారికి 29కి (16%) తగ్గింది.
నల్గొండలో ఘోర రోడ్డు ప్రమాదం.. 30మంది నర్సింగ్ విద్యార్థులకు గాయాలు, ముగ్గురి పరిస్థితి విషమం...
తీవ్రమైన నేరారోపణలంటే.. దాడి, హత్య, కిడ్నాప్, అత్యాచారానికి సంబంధించి గరిష్టంగా ఐదు సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ శిక్ష పడే అవకావశాలుంటాయి. ఇందులో నాన్-బెయిలబుల్ నేరాలు కూడా ఉంటాయి. కాగా.. బీజేపీ తరపున గెలిచిన 156 మంది అభ్యర్థుల్లో 26 మంది ఎమ్మెల్యేలపై క్రిమినల్ కేసులు నమోదు కాగా.. కాంగ్రెస్‌కు చెందిన 17 మంది గెలిచిన అభ్యర్థుల్లో 9 మందిపై కేసులు నమోదయ్యాయి. ఐదు స్థానాలు గెలుచుకున్న ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నుంచి గెలిచిన ఇద్దరు అభ్యర్థులపై క్రిమినల్ కేసులు ఉన్నాయి. సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) గెలిచిన ఒక్క ఎమ్మెల్యేపై కూడా క్రిమినల్ కేసు ఉంది.
ఇదిలా ఉండగా.. కొత్త శాసనసభ్యుల ఆస్తులను కూడా ఏడీఆర్ నివేదిక వెల్లడించింది.‘‘ మొత్తం 182 మంది అభ్యర్థుల్లో 151 మంది (83 శాతం) కోటీశ్వరులు. 2017 గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో 141 మంది (77%) కోటీశ్వరులు ఉన్నారు’’ అని పేర్కొంది. గెలిచిన 156 మంది అభ్యర్థుల్లో అత్యధికంగా 132 మంది కోటీశ్వలున్న పార్టీగా బీజేపీ మొదటి స్థానంలో నిలిచింది.
వీడెక్కడి మొగుడ్రా బాబూ.. ఆహారంలో వెంట్రుక వచ్చిందని.. భార్యకు గుండు కొట్టించాడు..
కాంగ్రెస్‌కు చెందిన 14 మంది అభ్యర్థులు, ఆమ్ ఆద్మీ పార్టీ, ఎస్పీల నుంచి గెలిచిన అభ్యర్థి తమను తాము కోటీశ్వరులుగా ప్రకటించుకున్నారు. బీజేపీ నుంచి గెలిచిన 156 మంది అభ్యర్థుల సగటు ఆస్తులు రూ.17.15 కోట్లుగా ఉన్నాయి. కాంగ్రెస్ నుంచి గెలిచిన 17 మంది అభ్యర్థుల సగటు ఆస్తి 5.51 కోట్లు కాగా, ఆప్ నుంచి గెలిచిన అభ్యర్థి సగటు ఆస్తులు రూ 98.70 లక్షలుగా ఉంది. ఎస్పీ నుంచి గెలిచిన ొక అభ్యర్థి ఆస్తి 20.94 కోట్లు, 3 స్వతంత్ర ఎమ్మెల్యేలకు సగటు ఆస్తి 63.94 కోట్లుగా ఉంది.
బలూచిస్థాన్‌లో పౌరులపై ఆఫ్ఘన్ బలగాల కాల్పులు.. 6 గురు మృతి.. 17 మందికి గాయాలు
గుజరాత్‌లోని మాన్సా నియోజకవర్గం నుండి గెలుపొందిన బీజేపీ అభ్యర్థి జయంతిభాయ్ సోమాభాయ్ పటేల్ రూ. 147 కోట్ల చరాస్తులు, రూ.514.3 కోట్ల స్థిరాస్తులతో మొత్తంగా రూ.661.3 కోట్ల ఆస్తులతో అత్యంత సంపన్న ఎమ్మెల్యేగా నిలిచారు. సిధ్‌పూర్ నియోజకవర్గం నుంచి గెలుపొందిన బీజేపీ ఎమ్మెల్యే బల్వంత్‌సిన్హ్ చందన్‌సిన్హ్ రాజ్‌పుత్ రెండో సంపన్న ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన తనకు వ్యాపారం, వాణిజ్యం, వ్యవసాయం ఆదాయ వనరులుగా ఉన్నాయని ప్రకటించారు. ఆయనకు మొత్తంగా రూ. 372 కోట్లకు పైగా ఆస్తులు ఉన్నాయి. ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులను మినహాయించి, 50 కోట్లకు పైగా ఆస్తులు ఉన్న పది మంది అభ్యర్థులు బీజేపీకి చెందినవారే ఉన్నారు.