వీడెక్కడి మొగుడ్రా బాబూ.. ఆహారంలో వెంట్రుక వచ్చిందని.. భార్యకు గుండు కొట్టించాడు..

Published : Dec 12, 2022, 10:18 AM IST
వీడెక్కడి మొగుడ్రా బాబూ.. ఆహారంలో వెంట్రుక వచ్చిందని.. భార్యకు గుండు కొట్టించాడు..

సారాంశం

ఆహారంలో తల వెంట్రుక వచ్చిందని.. భార్యకు గుండు కొట్టించాడో భర్త. దీనిమీద ఆ భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. 

ఉత్తర్ ప్రదేశ్ : ఆడపా,దడపా తినే ఆహారంలో తల వెంట్రుకలు రావడం మామూలే. ఇలా వస్తే ఏం చేస్తారు? ఎక్కడో ఒకటీ, అరా అయితే తీసేసి తింటారు. మరీ ఎక్కువగా కనిపిస్తే ఆ ఆహారాన్ని పడేస్తారు. అందుకే స్టార్ హోటల్స్ లో పనిచేసేవారు ముఖ్యంగా.. చెఫ్ లు, వారి స్టాప్ తప్పనిసరిగా నెత్తిని కవర్ చేసుకుంటారు. ఆహారంలో వెంట్రుకలు పడడం వల్ల తమ హోటల్ రెప్యుటేషన్ దెబ్బతినకుండా ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు. 

అయితే, ఉత్తర్ ప్రదేశ్ లో ఓ షాకింగ్ ఘటన జరిగింది. అన్నంలో తల వెంట్రుకలు వచ్చాయని ఓ భర్త మాత్రం ఏకంగా భార్యకు గుండు కొట్టించాడు. ఉత్తర్ ప్రదేశ్ లో పిలీభీత్ జిల్లా మిలాక్ గ్రామానికి చెందిన జహీరుద్దీన్ కు, సీమాదేవి(30)కి ఏడేళ్ల కింద పెళ్లయ్యింది. శుక్రవారం నాడు జహీరుద్దీన్ భోజనం చేస్తుంటే ఆహారంలో వెంట్రుక వచ్చింది. దీంతో అతను చాలా కోపానికి వచ్చాడు.

బలూచిస్థాన్‌లో పౌరులపై ఆఫ్ఘన్ బలగాల కాల్పులు.. 6 గురు మృతి.. 17 మందికి గాయాలు

భార్యతో గొడవకు దిగారు. ఆ తరువాత.. అంతటితో ఊరుకోలేదు. భార్యకు బలవంతంగా గుండు కొట్టించాడు. దీంతో భార్య విపరీతంగా అవమానపడింది. వెంటనే పోలీస్ స్టేషన్ కు చేరుకుని.. భర్త చర్య మీద ఫిర్యాదు చేసింది. అతని మీద కఠినంగా చర్యలు తీసుకోవాలని కోరింది. పెళ్లై ఏడేళ్లైనా అత్తింటివారి వేధింపులు తగ్గడం లేదని, పెళ్లైన నాటినుంచి అదరంగా మరో రూ.15 లక్షలు కట్నం ఇవ్వాలని అత్తింటివారు వేధిస్తున్నారని చెప్పుకొచ్చింది. దీంతో పోలీసులు నిందితుల మీద వరకట్న చట్టంతో సహా పలు సెక్షన్ల కింద కేసులు నమోదుచేశారు. సదరు మహిళ భర్తను అరెస్ట్ చేసి జైలుకు పంపారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

తమిళనాడు అసెంబ్లీలో సీఎం విజయ్ పవర్ ఫుల్ స్పీచ్ | CM Vijay Powerful Speech in Assembly
నేపాల్ వరద విధ్వంసం తర్వాత ప్రస్తుతం ఎలా ఉందో చూడండి | Nepal Floods Massive Cleanup Underway