
Rohit Sharma: టీమిండియా కెప్టెన్‌గా రోహిత్ శర్మ వరుస విజయాలతో అరుదైన రికార్డులకు సృష్టిస్తూ.. దూసుకపోతున్నారు. వరుసగా న్యూజిల్యాండ్, వెస్టిండీస్, శ్రీలంక సిరీసులను క్లీన్‌స్వీప్ చేసి.. నయా రికార్డులను క్రియేట్ చేశారు. ఆయన కేవలం అన్ ఫీల్డ్ లోనే కాదు.. ఇప్పుడు ఆఫ్‌ఫీల్డ్‌లో మరో పనితో వార్తల్లో నిలిచాడు. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అత్యంత ఖరీదైన లంబోర్గినీ ఉరుస్ ఎస్‌యూవీని కొనుగోలు చేశారు. పర్సనలైజ్డ్ ఇంటీరియర్స్ ఉన్న లంబోర్ఘినీ ఉరుస్ కారు విలువ తెలిస్తే.. అవాక్కు కావాల్సిందే. దీని విలువ అక్షరాల రూ. 3.15 కోట్లు. టీమిండియా జెర్సీ రంగులో మెరిసిపోతున్న ఈ కారు చూస్తే ఎవరైనా వావ్ అనాల్సిందే.
ఉరుస్ అనేది ఇటాలియన్ సూపర్ కార్ తయారీదారు లంబోర్ఘినిచే ఉత్పత్తి చేయబడింది. అత్యంత విలాసవంతమైన వాహనాలలో తయారీలో ఇది ఒకటి. ఇప్పటికే రణవీర్ సింగ్, కార్తీక్ ఆర్యన్, రోహిత్ శెట్టి, జూనియర్ ఎన్టీఆర్ వంటి ప్రముఖులు ఈ లగ్జరీ SUVని కొనుగోలు చేశారు. తాజాగా వారి తాజాలోకి భారత క్రికెట్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ చేరారు.
ఇది సూపర్ స్పోర్ట్స్ కార్. అంతే కాదు ఆల్ సర్ఫేస్ క్వాలిటీ కార్. అంటే కేవలం రోడ్ల మీద మాత్రమే కాదు.. దట్టమైన ఎడారి ప్రాంతంలో కూడా అదిరిపోయే రైడ్ చేయొచ్చు. దాంతో పాటు కొండ ప్రాంతంలో కూడా ఈ కారు ఎలాంటి సమస్య లేకుండా ముందుకు దూసుకుపోతుంది. ఏదేమైనా కూడా రోహిత్ శర్మ కొత్త కారు గురించి ఇప్పుడు నెట్టింట్లో చర్చ బాగానే జరుగుతుంది. టీమిండియా జెర్సీ రంగులో మెరిసిపోతున్న ఈ కారు ఫోటోలను అభిమానులతో పంచుకున్నారు. ముంబైలోని లంబోర్ఘిని షోరూం ఇప్పటికే ఈ కారును రోహిత్ ఇంటికి డెలివరీ చేసినట్టు సమాచారం. .
హిట్ మ్యాన్.. కారు బయట బ్లూ కలర్ ఉన్న.. లోపల తనకు నచ్చినట్టుగానే డిజైన్ చేసుకున్నాడు. ఈ కారు లో చెర్రీ రెడ్ కలర్ లో సీట్లు, కారు క్యాబిన్ మాత్రం బ్లాక్ కలర్ లో డిజైన్ చేయించాడు. మొత్తానికి ఇంత కాస్ట్‌లీ కారును కొనుగోలు చేసిన మొదటి క్రికెటర్ రోహితే అని తెలుస్తోంది. రోహిత్ కొత్త కారు ఫొటోలు చూసిన నెటిజన్లు ‘వావ్’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. ‘లుక్స్ అదుర్స్’ అంటూ మరికొందరు అంటున్నారు.
మరోవైపు.. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ అయినట్టు తెలుస్తోంది. రోహిత్ శర్మ తన ట్విట్టర్ ఖాతా నుంచి.. ఇష్టవచ్చినట్టు.. వరుసగా అర్థం పర్థం లేని ట్వీట్లు వస్తుండటంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. మంగళవారం.. రోహిత్ శర్మ ట్విట్టర్ ఖాతా నుంచి తనకు కాయిన్ టాస్‌లంటే ఇష్టమని, అవి తన కడుపులో ఎప్పుడు చేరుతాయోనని ఓ ట్వీట్ వచ్చింది. అలాగే మీకు తెలుసా? సందడి చేసే తేనేటీగలు గొప్ప బాక్సింగ్ బ్యాగ్‌లను కలిగి ఉంటాయని మరో ట్వీట్ వచ్చింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా రోహిత్ శర్మ అభిమానులు ఆందోళనకు గురయ్యారు. అతని అకౌంట్ హ్యాక్ అయి ఉంటుందని అభిమానులతోపాటు నెటిజన్లు భావిస్తున్నారు
రోహిత్ శర్మ వరుస విజయాలతో దూసుకపోతున్నారు. శ్రీలంకతో టీ20 సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసిన రోహిత్.. స్వదేశంలో అత్యధిక టీ20 మ్యాచులు గెలిచిన కెప్టెన్ గా రికార్డు క్రియేట్ చేశారు. ప్రస్తుతం స్వదేశంలో 17 విజయాలతో ఈ జాబితాలో రోహిత్ టాప్‌లో ఉన్నాడు. అతని తర్వాత ఇంగ్లండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్, న్యూజిల్యాండ్ సారధి కేన్ విలియమ్సన్ ఉన్నారు.