సీపీఎం సీనియర్ నేత నిరుపమ్ సేన్ కన్నుమూత

sivanagaprasad kodati |  
Published : Dec 24, 2018, 11:45 AM IST
సీపీఎం సీనియర్ నేత నిరుపమ్ సేన్ కన్నుమూత

సారాంశం

సీపీఎం సీనియర్ నేత, వామపక్ష దిగ్గజం నిరుపమ్ సేన్ కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన కోల్‌కతాలోని సిటీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. తీవ్ర గుండెపోటుతో సేన్ మరణించారని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. 

సీపీఎం సీనియర్ నేత, వామపక్ష దిగ్గజం నిరుపమ్ సేన్ కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన కోల్‌కతాలోని సిటీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.

తీవ్ర గుండెపోటుతో సేన్ మరణించారని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడిగా గతంలో పనిచేసిన సేన్ పశ్చిమ బెంగాల్ వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రిగా సేవలందించారు.

ఆయనకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. నిరుపమ్ భౌతికకాయాన్ని ప్రజలు, కార్యకర్తల సందర్శనార్థం పార్టీ రాష్ట్ర కార్యలయానికి తరలిస్తారని సీపీఎం వర్గాలు తెలిపాయి. బుధవారం సాయంత్రం సేన్ స్వస్థలం బుర్ద్వాన్‌లో అంత్యక్రియలు జరుగుతాయని ప్రకటించారు.

PREV
click me!

Recommended Stories

గంటకు 9 కి.మీ స్పీడ్, 46 కి.మీ ప్రయాణానికి 5 గంటలా..! దేశంలోనే స్లోయెస్ట్ ట్రైన్ ఏదో తెలుసా?
Weather Update : మళ్లీ భారీ వర్షాలు.. ఈ ప్రాంతాలకు ఐఎండీ అలర్ట్ !