భారత్‌ను చూసి నేర్చుకోండి...పాక్ ప్రధానికి ఒవైసీ కౌంటర్

By sivanagaprasad kodatiFirst Published Dec 24, 2018, 11:34 AM IST
Highlights

మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఒవైసీ పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ గట్టిగా బదులిచ్చారు. మైనారిటీలతో ఎలా మెలగాలో మోడీ ప్రభుత్వానికి చూపెడతామని ఇమ్రాన్ వ్యాఖ్యానించడంపై అసదుద్దీన్ మండిపడ్డారు.

మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఒవైసీ పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ గట్టిగా బదులిచ్చారు. మైనారిటీలతో ఎలా మెలగాలో మోడీ ప్రభుత్వానికి చూపెడతామని ఇమ్రాన్ వ్యాఖ్యానించడంపై అసదుద్దీన్ మండిపడ్డారు.

మైనారీటల సంక్షేమం, రాజ్యాంగ హక్కుల విషయంలో భారతదేశాన్ని చూసి పాకిస్తాన్ చాలా నేర్చుకోవాలని సూచించారు. పాక్ రాజ్యాంగం ప్రకారం ముస్లిం వ్యక్తి మాత్రమే దేశ ప్రధాని కాగలడు, కానీ భారత్‌లో అన్ని వర్గాల ప్రజలకు ఆ అవకాశం ఉంటుందని అసదుద్దీన్ స్పష్టం చేశారు.

కాగా, ఒక సమావేశంలో పాల్గొన్న పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మాట్లాడుతూ... భారత్‌లో మైనారిటీలను ఇతర పౌరులతో సమానంగా చూడటం లేదని అందరూ అంటున్నారు. బలహీన వర్గాలకు అన్యాయం జరిగితే, అది తిరుగుబాటుకు దారి తీస్తుందని ఇమ్రాన్ వ్యాఖ్యానించారు.

click me!