గంజాయిమత్తులో ఆవుపై అత్యాచారం, మృతి.. మూగజీవి కాళ్లు, మెడ కట్టేసి అఘాయిత్యం..

Published : Jan 13, 2023, 09:34 AM IST
గంజాయిమత్తులో ఆవుపై అత్యాచారం, మృతి.. మూగజీవి కాళ్లు, మెడ కట్టేసి అఘాయిత్యం..

సారాంశం

పుదుచ్చేరిలోని యానాంలో దారుణ ఘటన వెలుగు చూసింది. కన్నూ మిన్నూ కానక.. గంజాయిమత్తులో ఆవుపై అత్యాచారానికి పాల్పడ్డారు. దీంతో ఆవు మృతి చెందింది. 

యానాం : కామంతో కళ్ళు మూసుకుపోయి చిన్నా, పెద్దా మరిచి.. వయసు తారతమ్యాలు లెక్కచేయక.. ఆడవారిపై అఘాయిత్యాలకు  పాల్పడుతున్న కామాంధులు..  చివరికి మూగజీవాలను కూడా వదలడం లేదు. మానవత్వం మరిచి, పైశాచికంగా వ్యవహరిస్తున్నారు. గంజాయి మత్తు నెత్తికెక్కి.. మదంతో ఒళ్ళు కొవ్వెక్కి.. ఆవుపై అత్యాచారానికి పాల్పడ్డారు దుర్మార్గులు. హృదయ విదారకమైన ఈ ఘటనలో తనకు జరిగిన ఘోరాన్ని చెప్పుకోలేక.. ఆ పైశాచికత్వాన్ని తట్టుకోలేక ఆ మూగ జీవి  ఊపిరి చాలించింది.  బుధవారం రాత్రి యానాంలో ఈ దారుణ ఘటన వెలుగు చూసింది. జాతీయరహదారికి ఆనుకుని ఉన్న ఓ కొబ్బరి తోటలో ఈ దారుణానికి ఒడిగట్టారు.

ఈ ఘటనలో మృతి చెందిన ఆవు పొగాకు ఈశ్వరరావు అనే రైతుది. కామాంధులు ఆవు నాలుగు కాళ్ళను, మెడను తాళ్లతో కట్టేశారు. ఆ తర్వాత దానిమీద లైంగిక దాడికి పాల్పడ్డారు.  పొగాకు ఈశ్వర రావు గురువారం ఉదయం కొబ్బరి తోటకు  వెళ్లేసరికి ఆవు చనిపోయి కనిపించింది. దాని కాళ్ళకి, మెడకి  తాళ్లు కట్టేసి ఉన్నాయి.  అంతేకాదు ఆ చుట్టుపక్కల గంజాయి తాగిన ఆనవాళ్లు కూడా కనిపించాయి.

వలపు వల.. వీడియో కాల్ మాట్లాడి, గదికి తీసుకువెళ్లి.. రూ.16.5లక్షలకు కుచ్చుటోపీ.. చివరికి..

వెంటనే ఈశ్వర రావు యానాం పోలీసులకు ఈ ఘటన మీద  సమాచారం ఇచ్చాడు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలని..  దీనికోసం పోలీసులు గస్తీ పెంచాలని విజ్ఞప్తి చేశారు. అయితే,  పుదుచ్చేరి పశు వైద్యాధికారి కదిరేశన్ ఈ ఘటన మీద మాట్లాడుతూ..  లైంగిక దాడితోపాటు.. ఊపిరాడకపోవడంతోనే ఆవు మృతి చెంది ఉంటుందని అన్నారు. మూగజీవాలతో లైంగిక చర్యలకు పాల్పడటం.. వాటికి హాని కలిగించడం చట్టరీత్య తీవ్రమైన నేరమని పేర్కొన్నారు. 

PREV
click me!

Recommended Stories

NDA సమావేశంలో చంద్రబాబు పంచ్ లకి పడిపడి నవ్విన మోదీ | NDA Meeting 2026 | Asianet News Telugu
Bharathiraja: భారతిరాజాకి నివాళి అర్పించిన తమిళ సినీ ప్రముఖులు | Asianet News Telugu