కరోనా టీకాకు సన్నద్దం: రెండు రోజుల్లో రాష్ట్రాలకు కోవిడ్ వ్యాక్సిన్

By narsimha lodeFirst Published Jan 7, 2021, 4:22 PM IST
Highlights

ఇవాళ లేదా రేపటి నుండి కరోనా వ్యాక్సిన్ రవాణాను ప్రారంభిస్తామని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి  హర్షవర్ధన్ చెప్పారు. 
దేశంలో కోవాగ్జిన్, కోవిషీల్డ్ వ్యాక్సిన్లకు డీసీజీఐ అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే.


న్యూఢిల్లీ : ఇవాళ లేదా రేపటి నుండి కరోనా వ్యాక్సిన్ రవాణాను ప్రారంభిస్తామని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి  హర్షవర్ధన్ చెప్పారు. 
దేశంలో కోవాగ్జిన్, కోవిషీల్డ్ వ్యాక్సిన్లకు డీసీజీఐ అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే.

దేశ వ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో కేంద్రపాలిత ప్రాంతాలు, రాష్ట్రాల ఆరోగ్యశాఖ మంత్రులతో గురువారం నాడు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్దన్ ఇవాళ సమీక్ష నిర్వహించారు.

ప్రయాణీకులను తరలించే విమానాల్లో టీకాలను తరలిస్తామని ఆయన చెప్పారు. మహారాష్ట్ర, కేరళ, చత్తీస్‌ఘడ్ రాష్ట్రాల్లో కేసులు అనుహ్యంగా పెరగడంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు.టీకాలపై అసత్య ప్రచారాన్ని ఎవరూ కూడ నమ్మొద్దన్నారు.  ప్రాధామ్య వర్గాలకు తొలుత టీకా ఇవ్వాలని డీసీజీఐ సూచించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.

ఈ నెల 3వ తేదీన కోవాగ్జిన్, కోవిషీల్డ్ టీకాలకు డీసీజీఐ అనుమతి ఇచ్చింది.నిపుణుల కమిటీ సిఫారసు చేసిన మరునాడే అత్యవసర వినియోగం కోసం ఈ టీకాల వినియోగానికి డీసీజీఐ అనుమతి ఇచ్చింది.
 


 

click me!