భార్యకు కరోనా... తెలిసికూడా హాస్పిటల్ నుండి ఇంటికి తీసుకెళ్లిన భర్త

By Arun Kumar P  |  First Published Jul 19, 2020, 8:07 AM IST

కరోనా సోకి హాస్పిటల్ చికిత్స పొందుతున్న ఓ మహిళను భర్త బలవంతంగా బయటకు తీసుకువచ్చిన ఘటన  కర్ణాటకలో చోటుచేసుకుంది. 


బెంగళూరు: కరోనా సోకి హాస్పిటల్ చికిత్స పొందుతున్న ఓ మహిళను భర్త బలవంతంగా బయటకు తీసుకువచ్చిన ఘటన  కర్ణాటకలో చోటుచేసుకుంది. హాస్పిటల్ సిబ్బంది కళ్లుగప్పి కరోనా రోగిని బయటకుతీసువచ్చినట్లు మంగుళూరు ప్రజల్లో భయాందోళన మొదలయ్యింది. 

మంగుళూరుకు చెందిన ఓ మహిళ కరోనా లక్షణాలతో బాధపడుతుండటంతో పరీక్షలు నిర్వహించారు. ఇందులో పాజిటివ్ గా తేలడంతో హాస్పిటల్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు. సదరు మహిళకు కొద్దిరోజుల క్రితమే ప్రసవం జరిగింది. దీంతో చంటిపిల్లాడిని కూడా తల్లి వుండే హాస్పిటల్ లోనే వుంచారు.

Latest Videos

undefined

read more   భారత్ లో కరోనా.. నిన్న ఒక్కరోజే 35వేల కేసులు

అయితే భార్యకు కరోనా సోకినట్లు తెలిసికూడా ఆమె భర్త మూర్ఖంగా ప్రవర్తించాడు. ఆమెను ఎలాగయినా ఇంటికి తీసుకుని వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. ఇందులో భాగంగానే ఆమెను ఇంటికి తీసుకెళ్లడానికి హాస్పిటల్‌‌కు వచ్చిన భర్తను సిబ్బంది అడ్డగించారు. అయితే వారి కళ్లుగప్పి ఎలాగోలా హాస్పిటల్ నుండి తప్పించుకుని కరోనా పేషంట్ ను హాస్పిటల్ నుండి ఇంటికిచేర్చాడు. 

భార్య, పసిబిడ్డను తీసుకొని అతను ఇంటికెళ్లిపోయినట్లు తెలిసిన హాస్పిటల్ సిబ్బంది స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు కేవలం గంటల వ్యవధిలోనే ఈ కుటుంబాన్ని ట్రేస్ చేశారు. మహిళను తిరిగి హాస్పిటల్ లో చేర్చారు.  


 

click me!