15-18 ఏళ్ల వయసు పిల్లలకు వ్యాక్సిన్: 100 శాతం పూర్తి .. లక్ష్యద్వీప్ అరుదైన ఘనత

By Siva KodatiFirst Published Jan 11, 2022, 10:39 PM IST
Highlights

కరోనాపై వ్యాక్సిన్ అతిపెద్ద ఆయుధం. జనవరి 3 నుంచి దేశంలోని 15 సంవత్సరాల నుండి 18 సంవత్సరాల మధ్య పిల్లలకు కూడా కరోనాను నివారించడానికి వ్యాక్సిన్ డోస్‌లు ఇస్తోంది కేంద్ర ప్రభుత్వం. ఈ నేపథ్యంలో లక్షద్వీప్‌ పిల్లలకు 100% టీకాలు వేసిన ఘనతను అందుకుంది. 

కరోనాపై వ్యాక్సిన్ అతిపెద్ద ఆయుధం. జనవరి 3 నుంచి దేశంలోని 15 సంవత్సరాల నుండి 18 సంవత్సరాల మధ్య పిల్లలకు కూడా కరోనాను నివారించడానికి వ్యాక్సిన్ డోస్‌లు ఇస్తోంది కేంద్ర ప్రభుత్వం. ఈ నేపథ్యంలో లక్షద్వీప్‌ పిల్లలకు 100% టీకాలు వేసిన ఘనతను అందుకుంది. ఇప్పటి వరకు దేశంలో ఏ రాష్ట్రంలోనూ పిల్లలకు 100% టీకాలు వేయలేదు.

కవరత్తిలో 2021 జనవరి 3న లక్ష్యద్వీప్ అడ్మినిస్ట్రేటర్ ప్రఫుల్ పటేల్ పిల్లలకు వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌ను ప్రారంభించారు. లక్ష్యద్వీప్‌లోని మొత్తం పది దీవుల్లోని పాఠశాలల్లో నిర్వహించిన వివిధ అవగాహన ర్యాలీల ద్వారా టీకా డ్రైవ్ ప్రారంభించారు. వారం రోజుల్లోనే 3,492 మందికి వ్యాక్సిన్లను అందజేశారు. అంతకుముందే ఆరోగ్య కార్యకర్తలు, ఫ్రంట్‌లైన్ కార్మికులు, 18 సంవత్సరాలు దాటిన వారికి 100 శాతం టీకాలు వేసిన కేంద్ర పాలిత ప్రాంతం/ రాష్ట్రంగా లక్ష్యద్వీప్ నిలిచింది. 

కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ లెక్కల ప్రకారం.. భారత ప్రభుత్వం పిల్లలకు టీకాను సులభతరం చేయడానికి, బూస్టర్ డోసులను అందించేందుకు గాను కోవాగ్జిన్ డోసులను అందించింది. దీంతో లక్ష్యద్వీప్ అడ్మినిస్ట్రేషన్ ఐసీఎంఆర్ మార్గదర్శకాల ప్రకారం 2021 జనవరి 10 నుంచి ఫ్రంట్‌లైన్ కార్మికులు, ఆరోగ్య కార్యకర్తలు, 60 ఏళ్లు దాటిని వారికి బూస్టర్ డోసులను వేయడం ప్రారంభించింది. థర్డ్ వేవ్ నేపథ్యంలో లక్ష్యద్వీప్‌లోకి ప్రవేశించాలంటే ఆర్టీపీసీఆర్ నెగిటివ్ సర్టిఫికేట్ తప్పనిసరి. ఇప్పటికే రాత్రిపూట కర్ఫ్యూ విధించడంతో పాటు టీకా, టెస్టింగ్, ట్రాకింగ్ వంటి కార్యక్రమాలను లక్ష్యద్వీప్ అమలు చేస్తోంది. 

గడిచిన 24 గంటల్లో 92 లక్షల మంది (92,07,700)కి పైగా వ్యాక్సిన్ డోస్‌లు పంపిణీ చేశారు. భారత్ COVID-19 టీకా కవరేజీ మంగళవారం ఉదయం 7 గంటల నాటికి 152.89 కోట్లు (1,51,89,70,294) మించిపోయింది. 1,63,81,175 టీకా సెషన్ల ద్వారా ఈ ఘనత సాధించారు. దేశవ్యాప్త ఇమ్యునైజేషన్ డ్రైవ్‌లో భాగంగా, కేంద్ర ప్రభుత్వం... రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఉచిత కోవిడ్ వ్యాక్సిన్‌లను అందిస్తోంది.
 

click me!