ఆ ఊర్లో సగం మందికి పాజిటివ్..! గ్రామం సీల్ డౌన్..!!

By AN TeluguFirst Published Apr 23, 2021, 1:31 PM IST
Highlights

కరోనా విలయతాండవం ఏ రేంజ్ లో కొనసాగుతోందంటే.. గ్రామాలకు గ్రామాలే దాని బారిన పడి కల్లోలం అవుతున్నాయి. ప్రపంచమంతా కరోనాతో వణికిపోతోంది. ఎన్ని చర్యలు తీసుకున్నా కరోనా వ్యాప్తిని అడ్డుకోలేక పోతున్నారు. 

కరోనా విలయతాండవం ఏ రేంజ్ లో కొనసాగుతోందంటే.. గ్రామాలకు గ్రామాలే దాని బారిన పడి కల్లోలం అవుతున్నాయి. ప్రపంచమంతా కరోనాతో వణికిపోతోంది. ఎన్ని చర్యలు తీసుకున్నా కరోనా వ్యాప్తిని అడ్డుకోలేక పోతున్నారు. 

బెంగళూరులో కరోనా కరాళ నృత్యం చేస్తోంది. మహానగరాలు, జిల్లా కేంద్రాలే కాకుండా రాష్ట్రంలోని మాముమూల పల్లెలు కూడా కరోనాతో కకావికలం అవుతున్నాయి. బెళగావి జిల్లా ఖానాపుర తాలూకా అబనహళ్ళిలో వెలుగు చూసిన కరోనా పాజిటివ్ కేసులు బెంబేలెత్తిస్తున్నాయి. 

అమనహళ్ళిలో 300మంది జనాభా ఉన్నారు. ఇటీవల ఈ గ్రామంలో పలువురికి పాజిటివ్ రావడంతో గ్రామంలోని అందరికీ పరీక్షలు నిర్వహించారు. వీరిలో 144 మందికి కోవిడ్ పాజిటివ్ గా నిర్థారణ అయ్యింది. అంటే సగం మంది కరోనా కోరల్లో ఇరుక్కున్నారని తేలింది. 

దీంతో బెళగావి జిల్లా యంత్రాంగం ఖంగుతిన్నది. బాధితులందరినీ అందుబాటులో ఉన్న ఆస్పత్రుల్లో చేర్పించారు. గ్రామాన్ని పూర్తిగా సీల్ డౌన్ చేశారు. రాష్ట్రంలో రెండో విడత కోవిడ్ ప్రబలిన తర్వాత ఓ గ్రామం మొత్తం సీల్ డౌన్ కావడం ఇదే మొదటిసారి. 

ఈ గ్రామంలోని ప్రతీ కుటుంబంలోని ఒకరో, ఇద్దరో  గోవా, మహారాష్ట్రలకు కూలీ పనులకు వెళ్తుంటారు. ప్రస్తుతం ఈ రెండు రాస్ట్రాల్లోనూ కోవిడ్ విలయతాండవం చేస్తుండడంతో ఈ నెల 10వ తేదీన దాదాపు అందరూ గ్రామానికి వాపసు వచ్చారు. 

మొదట ఒక ముగ్గురికి కోవిడ్ వచ్చింది. వారు పరీక్షలు చేయించుకున్నారు. ఆ తరువాత  లక్షణాలు తీవ్రం కావడంతో అందరూ పరీక్షలు చేయించుకున్నారు. 

click me!