Covid-19 Control Rooms: బీ అలెర్ట్..! క‌రోనా కంట్రోల్ రూమ్‌ల ఏర్పాటు.. రాష్ట్రాల‌కు కేంద్రం లేఖ‌

By Rajesh K  |  First Published Jan 6, 2022, 11:07 PM IST

Covid-19 Control Roomsగ‌త కొద్ది రోజులుగా దేశంలో క‌రోనా కేసులు  భారీగా పెరుగుతున్న విషయం తెలిసిందే. దేశంలో థర్డ్ వేవ్ మొదలైందని అప్రమత్తంగా ఉండాలని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.  ఈ నేప‌థ్యంలో కేంద్రం వ్యాక్సినేష‌న్ ను వేగ‌వంతం చేసింది. ఇదిలా ఉంటే. కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ చాప కింద నీరులా పాకుతూ దేశవ్యాప్తంగా తన ఉనికిని మళ్లీ చాటేందుకు చూస్తోంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. దీంతో మ‌రో సారి రాష్ట్రాల‌కు, కేంద్ర‌పాలిత ప్రాంతాలకు కేంద్రం లేఖ రాసింది. 
 


Covid-19 Control Rooms:  భార‌త్ లో కరోనా మళ్లీ విజృంభిస్తోంది. ఒక్కసారిగా పెరుగుతున్నకేసుల సంఖ్య పెరుగుతోంది. నిన్న  దాదాపు ల‌క్ష కు చేరువ‌లో కేసులు న‌మోద‌య్యాయి. దీంతో దేశ‌వ్యాప్తంగా ఆందోళన మొదలైంది. వీటితోపాటు కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు కూడా భారీగా పెరుగుతున్నాయి. మ‌రోవైపు దేశంలో థర్డ్ వేవ్ మొదలైందని అప్రమత్తంగా ఉండాలని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో కేంద్రం ఎప్పటికప్పుడు రాష్ట్రాలను అప్రమత్తం చేస్తోంది. ఈ క్ర‌మంలో మరోసారి కేంద్రం కేంద్రపాలిత ప్రాంతాలకు రాష్ట్రాలకు లేఖ రాసింది.                       
 
క‌రోనా కేసులు పెరుగుతున్న నేప‌థ్యంలో కోవిడ్‌ నివారణ చర్యలను తీసుకోవాల‌ని, ముందస్తుగా ఏర్పాటు చేసుకోవాలని కేంద్ర ఆరోగ్యశాఖ ఆదేశించింది. కరోనా బాధితుల కోసం జిల్లా స్థాయి కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేయాలని సూచించింది. పెద్ద జిల్లా అయితే ఉప జిల్లా కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేయాల‌ని, వీటి ద్వారా  సలహాలు, సూచనలిస్తూ.. పరిస్థితిపై ఎప్పటికప్పుడు సమీక్షించాలని పేర్కొంది. కంట్రోల్ రూమ్స్‌లలో వైద్య సిబ్బంది, వలంటీర్స్, కౌన్సిలర్స్, జనాభాకు అనుగుణంగా తగినన్ని టెలిఫోన్లను అందుబాటులో ఉంచాలంటూ కేంద్రం లేఖలో స్పష్టంచేసింది.  అంతేకాకుండా బ్రాడ్‌బాండ్‌తో కూడిన కంప్యూటర్లను అందుబాటులో ఉంచాలని వెల్లడించింది. జిల్లా, సబ్‌ స్థాయిలో కంట్రోల్‌ రూమ్స్‌ ఏర్పాటు చేయాలిని సూచించింది. 

కంట్రోల్ రూమ్‌ల్లో తప్పనిసరిగా COVID పరీక్షా కేంద్రాలు, అలాగే.. కరోనా కేసులు ఎక్కువగా పెరుగుదల ఉన్న ప్రాంతాల్లో రోగుల‌ను త‌ర‌లించ‌డానికి అంబులెన్స్‌ల సౌక‌ర్యం ఉండాలని పేర్కొంది. కంట్రోల్ రూమ్స్ 24 గంటలు పనిచేయాలని సూచించింది. జిల్లాలో కరోనా కేసుల సంఖ్య నమోదుకు అనుగుణంగా వైరస్ బాధితులకు ఎప్పటికప్పుడు సహాయం అందించాలని పేర్కొంది. జిల్లా పరిధిలోని ఆసుపత్రుల్లో ఎక్కడెక్కడ బెడ్స్ అందుబాటులో ఉన్నాయో కంట్రోల్ రూమ్స్ ద్వారా మానిటరింగ్ చేస్తూ ఫోన్ కాల్స్‌లో సమాధానం చెబుతుండాలని సూచించింది. ఈ కంట్రోల్ రూమ్‌ల ద్వారా.. హోమ్ ఐసోలేషన్‌లో ఉన్న రోగులను క్రమం తప్పకుండా పర్యవేక్షించాల‌ని సూచించింది.

Latest Videos

అలాగే.. క‌రోనా రోగులకు కౌన్సెలింగ్ ఇచ్చేలా ఏర్పాటు చేయాలని తెలిపింది. కంట్రోల్ రూమ్‌ల యొక్క ప్రధాన బాధ్యతలలో ఒకటి.. వారి పరిధిలో హోమ్ ఐసోలేషన్‌లో ఉన్న రోగులందరి రోజువారీ స్థితి నివేదికను క్రోడీకరించడం, దానిని జిల్లా పరిపాలనకు సమర్పించడం ప్ర‌ధాన బాధ్య‌త అని కేంద్రం రాష్ట్రాలకు రాసిన లేఖలో తెలిపింది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం..  దేశంలో  ఓమిక్రాన్ వేరియంట్ కేసుల సంఖ్య 2,600 దాటింది. అలాగే భార‌త్ లో గ‌డిచిన 24 గంట‌ల స‌మ‌యంలో 90,928 కొత్త COVID-19 కేసులు అయ్యాయి. అదే స‌మ‌యంలో 19,206 రికవరీలు,  325 మరణాలు నమోదయ్యాయి. 

click me!