ఉద్ధవ్ థాక్రే సతీమణి ‘‘మరాఠీ రబ్రీదేవి’’ అంటూ పోస్ట్.. బీజేపీ సోషల్ మీడియా కార్యకర్త అరెస్ట్

Siva Kodati |  
Published : Jan 06, 2022, 07:43 PM ISTUpdated : Jan 06, 2022, 07:47 PM IST
ఉద్ధవ్ థాక్రే సతీమణి ‘‘మరాఠీ రబ్రీదేవి’’ అంటూ పోస్ట్.. బీజేపీ సోషల్ మీడియా కార్యకర్త అరెస్ట్

సారాంశం

మహారాష్ట్ర (Maharashtra ) ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే (Uddhav Thackeray) సతీమణి రష్మీ థాక్రేపై (Rashmi Thackeray) వివాదాస్పద ట్వీట్ చేసినందుకు ఆ రాష్ట్ర బీజేపీ (bjp) సోషల్ మీడియా సెల్ సభ్యుడిని ముంబై పోలీస్ క్రైమ్ బ్రాంచ్ సైబర్ సెల్ (Mumbai Police Crime Branch) గురువారం విచారణ కోసం అదుపులోకి తీసుకుంది

మహారాష్ట్ర (Maharashtra ) ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే (Uddhav Thackeray) సతీమణి రష్మీ థాక్రేపై (Rashmi Thackeray) వివాదాస్పద ట్వీట్ చేసినందుకు ఆ రాష్ట్ర బీజేపీ (bjp) సోషల్ మీడియా సెల్ సభ్యుడిని ముంబై పోలీస్ క్రైమ్ బ్రాంచ్ సైబర్ సెల్ (Mumbai Police Crime Branch) గురువారం విచారణ కోసం అదుపులోకి తీసుకుంది. వివరాల్లోకి వెళితే... జితేన్ గజారియా (Jiten Gajaria) అనే వ్యక్తి జనవరి 4న "మరాఠీ రబ్రీ దేవి" (Marathi Rabri Devi) అనే క్యాప్షన్‌తో రష్మీ థాక్రే ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దాణా కుంభకోణంపై ఆమె భర్త లాలూ ప్రసాద్‌ (Lalu Prasad) బలవంతంగా రాజీనామా చేయవలసి వచ్చినప్పుడు బీహార్‌లో రబ్రీ దేవి (Rabri Devi)బాధ్యతలు స్వీకరించినట్లే తన భార్య తన పదవిని చేపడతారని సూచిస్తూ సీఎం ఆరోగ్య సమస్యలను ఉద్దేశిస్తూ.. జితేన్ ఈ క్యాప్షన్ పెట్టాడు. 

మరోవైపు జితేన్ అరెస్ట్‌పై అతని తరపు న్యాయవాది, బిజెపి కార్యదర్శి వివేకానంద్ గుప్తా మాట్లాడుతూ, “సైబర్ పోలీసులు కారణం, ఫిర్యాదు చేసినవారు ఎవరో చెప్పకుండానే పోలీసు స్టేషన్‌లో హాజరుకావాలని అతనికి నోటీసులు ఇచ్చారని చెప్పారు. వారి ఆదేశాల ప్రకారం నా క్లయింట్ వారి ముందు హాజరు అయ్యాడని వివేకానంద చెప్పారు. ఈ కేసులో ఇంకా ఎఫ్‌ఐఆర్ నమోదు కాలేదని ఆయన తెలిపారు.

కాగా.. దాణా కుంభకోణంలో ప్రమేయం వున్నట్లు ఆరోపణలు రావడంతో అప్పటి బీహార్ ముఖ్యమంత్రిగా వున్న లాలూ ప్రసాద్ యాదవ్ రాజీనామా చేశారు. దీంతో రాష్ట్ర పగ్గాలను రబ్రీ దేవికి అప్పగించడంతో ఆమె జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో వార్తల్లో నిలిచారు. ఎలాంటి రాజకీయ అనుభవం లేదంటూ ప్రతిపక్షాలు దుమ్మెత్తి పోసినప్పటికీ.. రబ్రీదేవి ఎనిమిదేళ్ల పాటు బీహార్‌ను పాలించడం విశేషం.

ఇటీవల వెన్నెముక సమస్యతో గడిచిన రెండు నెలలుగా బాధపడుతున్నారు మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాక్రే. ఈ నేపథ్యంలో రాష్ట్ర సారథ్య బాధ్యతలను ఆయన తన భార్య రష్మీ థాక్రేకు కానీ, కుమారుడు మంత్రి ఆదిత్య థాక్రేకు ఇవ్వాలంటూ పలువురు బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

అసదుద్దీన్ యాక్టివ్.. మరి మీరేంటి.? తెలంగాణ ఎంపీలపై ప్రధాని మోదీ ఫైర్
ఏకంగా 5 ,000 వేల ఉద్యోగాలే..! : యువతకు బంపరాఫర్