భారత్ లో కోవిడ్ పంజా.. ఒక్క రోజే 841 కేసులు నమోదు.. 7 నెలల్లోనే అత్యధికం..

By Sairam IndurFirst Published Dec 31, 2023, 12:33 PM IST
Highlights

Covid-19 : దేశంలో కరోనా మళ్లీ తన ప్రతాపాన్ని చూపిస్తోంది. రోజు రోజు కేసులు పెరుగుతున్నాయి. నెల రోజుల కిందట వరకు మామూలుగా ఉన్న వ్యాప్తి.. ఇటీవల వేగం పుంజుకుంది. న్యూయర్ వేడుకల సమయంలో కేసులు పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. 

corona virus : భారతదేశంలో కోవిడ్ పంజా విసురుతోంది. కరోనా మహమ్మారి దేశం నుంచి వెళ్లిపోయిందని అనుకుంటున్న సమయంలో మళ్లీ అది వ్యాపిస్తోంది. గత నెల రోజుల నుంచి దాని వ్యాప్తిలో వేగం పెరిగింది. దీనికి తోడు ఈ కోవిడ్-19 కొత్త వేరియంట్ జేఎన్.1 కూడా విజృంభిస్తోంది. గడిచిన 24 గంటల్లో 841 కొత్త కోవిడ్ -19 కేసులు నమోదయ్యాయి. ఇది గత 227 రోజులు లేదా ఏడు నెలల్లో అత్యధిక రోజువారీ పెరుగుదల అని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆదివారం తెలిపింది.

2019లో పుల్వామాను, ఇప్పుడు రామ మందిరాన్ని.. ఓట్ల కోసమే బీజేపీ స్టంట్స్ - కర్ణాటక మంత్రి సంచలన వ్యాఖ్యలు

నేటి ఉదయం 8 గంటలకు అప్ డేట్ చేసిన వివరాల ప్రకారం.. తాజాగా నమోదైన కేసులతో కలిసి కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 3,997 నుంచి 4,309కి పెరిగింది. కరోనా కారణంగా దేశంలో కొత్తగా ముగ్గురు మరణించగా, కేరళ, కర్ణాటక, బీహార్ లలో ఒక్కొక్కరు మరణించారు. శనివారం విడుదల చేసిన డేటా ప్రకారం.. భారతదేశంలో 743 కొత్త కోవిడ్ -19 కేసులు, ఏడు మరణాలు నమోదయ్యాయి.

డిసెంబర్ 5 వరకు రోజువారీ కేసులు రెండంకెల స్థాయికి పడిపోయాయి. అయితే ఇన్ఫెక్షన్ రేటు తక్కువగా ఉన్న తర్వాత ఒక్క సారిగా కేసులు పెరిగాయి. కరోనా వైరస్ జెఎన్.1 సబ్ వేరియంట్ ఆవిర్భావం, వాతావరణం చల్లబడటం వంటి పరిస్థితులు ఇటీవల కేసులు పెరగడానికి దోహదం చేశాయి.

2020 జనవరిలో కోవిడ్ వ్యాప్తి చెందినప్పటి నుండి భారతదేశంలో 4.50 కోట్ల (4,50,13,272) కేసులు, 5,33,361 మరణాలు నమోదయ్యాయి. ఇటీవల కేసులు పెరిగినప్పటికీ, భారతదేశంలో రికవరీ రేటు 98.81 శాతంగా ఉంది, 4.44 కోట్ల (4,44,75,602) మంది అనారోగ్యం నుండి కోలుకున్నారు. దేశవ్యాప్త వ్యాక్సినేషన్ క్యాంపెయిన్ లో భాగంగా దేశంలో 220.67 కోట్ల డోసుల కోవిడ్ -19 వ్యాక్సిన్లను ఇచ్చినట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.

రేషన్ కార్డు ఉన్న వారికి గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం..

కాగా.. ప్రజలంతా కొత్త సంవత్సరానికి స్వాగతం పలికేందుకు దేశం సిద్ధమవుతున్న తరుణంలో కోవిడ్ వ్యాప్తి మరింతగా పెరిగే అవకాశం ఉంది. దీంతో ఆరోగ్య అధికారులు అప్రమత్తమయ్యారు. పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తున్నారు. వైరస్ మరింత వ్యాప్తి చెందకుండా ఉండటానికి కోవిడ్ -19 భద్రతా ప్రోటోకాల్ కు కట్టుబడి ఉండాలని ప్రజలను కోరుతున్నారు. అనారోగ్య సమస్యలున్నవారు, వృద్ధులు రద్దీ ప్రదేశాలకు దూరంగా ఉండాలని, మాస్క్ లు ధరించాలని నిపుణులు సూచిస్తున్నారు.

click me!