కరోనా మృతుల పోస్టుమార్టం నివేదికలో షాకింగ్ విషయాలు

By narsimha lode  |  First Published Aug 23, 2020, 6:29 PM IST

కరోనాతో మరణించిన రోగుల ఊపిరితిత్తుల్లో గాయాలు, రక్తం గడ్డకట్టినట్టుగా పోస్టుమార్టం నివేదికల్లో తెలుపుతున్నాయి. కరోనా సోకినవారిల్లో ఎక్కువగా ఊపిరితిత్తుల సమస్యలతో మరణిస్తున్నారు.  


న్యూఢిల్లీ: కరోనాతో మరణించిన రోగుల ఊపిరితిత్తుల్లో గాయాలు, రక్తం గడ్డకట్టినట్టుగా పోస్టుమార్టం నివేదికల్లో తెలుపుతున్నాయి. కరోనా సోకినవారిల్లో ఎక్కువగా ఊపిరితిత్తుల సమస్యలతో మరణిస్తున్నారు.  

కరోనాతో మరణించిన రోగుల మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహిస్తే వీరందరికి ఊపిరితిత్తుల్లోఇన్ ఫెక్షన్ ఉందని తేలింది. ఊపిరితిత్తుల్లో సమస్యల కారణంగానే ఎక్కువగా సమస్యలు ఉన్నాయని ఈ నివేదికలు తేల్చాయి. అంతేకాదు కిడ్నీల్లో కూడ గాయాలయ్యాయి.  మరో వైపు గుండె, కిడ్నీ, ఊపిరితిత్తుల్లో రక్తం గడ్డకట్టిందని పోస్టుమార్టం నివేదికలు తెలిపాయి.

Latest Videos

undefined

ఈ విషయాన్ని ఇంపీరియల్ కాలేజీ వెబ్ సైట్ లో ఓ నివేదికను ప్రచురించింది. ఊపిరితిత్తుల ఇన్ ఫెక్షన్ రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కరోనా రోగులకు సూచించారు నిపుణులు.  బ్లడ్ తిన్నర్స్ ను ఉపయోగించడం ద్వారా రక్తం గడ్డకట్టకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవచ్చని ఈ నివేదిక తెలిపింది. 

లండన్ లోని ఇంపీరియల్ కాలేజీలో గౌరవ క్లినికల్ సీనియర్ లెక్చరర్ డాక్టర్ మైఖేల్ ఓస్ బార్న్ తెలిపారు.ఇంపీరియల్ కాలేజీ హెల్త్ కేర్ ఎన్ హెచ్ ఎస్ ట్రస్ట్ లోని కన్సల్టెంట్ పాథాలజిస్ట్ అధ్యయనం  తెలిపిందని ఆయన వివరించారు. 

click me!