మందుల కోసం వెళ్లి బ్యాంకు దోపీడీ: సెక్యూరిటీ గార్డు అరెస్ట్

By narsimha lodeFirst Published Aug 23, 2020, 3:33 PM IST
Highlights

తాను పనిచేస్తున్న బ్యాంకుకే ఓ సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న వ్యక్తి స్వంత బ్యాంకుకే కన్నం వేశాడు. బ్యాంకులో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న వ్యక్తే ఈ  దోపీడీకి పాల్పడినట్టుగా గుర్తించారు పోలీసులు. అతడిని అరెస్ట్ చేశారు పోలీసులు.

మొహాలీ: తాను పనిచేస్తున్న బ్యాంకుకే ఓ సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న వ్యక్తి స్వంత బ్యాంకుకే కన్నం వేశాడు. బ్యాంకులో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న వ్యక్తే ఈ  దోపీడీకి పాల్పడినట్టుగా గుర్తించారు పోలీసులు. అతడిని అరెస్ట్ చేశారు పోలీసులు.

పంజాబ్ రాష్ట్రంలోని పార్చ్ గ్రామంలో గల యాక్సిస్ బ్యాంకు వద్ద సెక్యూరిటీ గార్డుగా బల్జీత్ సింగ్ పనిచేస్తున్నాడు. ఈ నెల 21వ తేదీన  మధ్యాహ్నం  ఈ ఘటన చోటు చేసుకొంది. బ్యాంకునుండి డిప్యూటీ మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్ ఇతర పనుల కోసం బ్యాంకు నుండి బయటకు వెళ్లారు. తన కొడుకుకు మందులు కొనుగోలు చేయాల్సిన అవసరం ఉందని సెక్యూరిటీ గార్డు బల్జీత్ సింగ్ బ్యాంకు మేనేజర్ కు చెప్పి బయటకు వెళ్లాడు.

ఆ సమయంలో బ్యాంకులో మేనేజర్, ఒక అటెండర్ మాత్రమే ఉన్నారు.  ముఖానికి ముసుగు వేసుకొన్న ఓ వ్యక్తి బ్యాంకులోకి ప్రవేశించి తనతో పాటు అటెండర్ ను రూమ్ లో బంధించి నగదు బాక్స్ ను అపహరించుకొని వెళ్లినట్టుగా బ్యాంకు మేనేజర్ అమన్ గంగీజా పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

ఈ విషయమై పోలీసులకు సెక్యూరిటీ గార్డుపై అనుమానం వచ్చింది. అతడిని విచారిస్తే అసలు విషయం తేలింది. ఈ దోపీడికి పాల్పడింది తానేనని  సెక్యూరిటీ పోలీసుల విచారణలో ఒప్పుకొన్నాడు.

సులభంగా డబ్బులు సంపాదించాలనే నెపంతో సెక్యూరిటీ గార్డు ఈ దోపీడీకి పాల్పడ్డాడని ఎస్పీ రావజ్యోత్ కౌర్ చెప్పారు. నిందితుడి నుండి కంట్రీమేడ్ తుపాకీని, బుల్లెట్లను కూడ స్వాధీనం చేసుకొన్నట్టుగా ఆమె చెప్పారు.

click me!