Covid-19 : 40వేల దిగువకు కొత్త కేసులు.. మరణాల్లోనూ భారీ తగ్గుదల...

Published : Sep 06, 2021, 10:15 AM IST
Covid-19 : 40వేల దిగువకు కొత్త కేసులు..  మరణాల్లోనూ భారీ తగ్గుదల...

సారాంశం

గడిచిన 24 గంటల్లో 43,903 మంది కోవిడ్ నుంచి కోలుకోగా.. రికవరీ రేటు 97.44 శాతంగా ఉంది. ప్రస్తుతం 4,04,874 మంది వైరస్ తో బాధపడుతుండగా.. క్రియాశీల కేసుల రేటు 1.23 శాతనికి చేరింది. ఇక దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. 

దేశంలో కరోనా కేసులు కాస్త తగ్గాయి. గత కొన్ని రోజులుగా 40వేల పైనే ఉంటోన్న కేసులు.. తాజాగా ఆ మార్క్ దిగువకు పడిపోయాయి. అటు మరణాల్లోనూ భారీ తగ్గుదల కన్పించడం కాస్త ఊరటనిస్తోంది. 24 గంటల వ్యవధిలో 38,948 కొత్త కేసులు బయట పడగా... 219 మంది మృత్యువాతపడ్డారు. క్రితం రోజు (42వేలు)తో పోలిస్తే 8.9శాతం తక్కువ కేసులు నమోదయ్యాయి. 

తాజా కేసులతో కలిపి దేశంలో మొత్తం కేసుల సంఖ్య 3.30 కోట్లు దాటింది. ఇక ఇప్పటివరకు 4,40,752 మందిని వైరస్ బలి తీసుకుంది. ఇదిల ఉండగా.. చాలా రోజుల తర్వాత కొత్త కేసుల కంటే కోలుకున్నవారి సంఖ్య ఎక్కువగా ఉండటం సానుకూలాంశం. 

గడిచిన 24 గంటల్లో 43,903 మంది కోవిడ్ నుంచి కోలుకోగా.. రికవరీ రేటు 97.44 శాతంగా ఉంది. ప్రస్తుతం 4,04,874 మంది వైరస్ తో బాధపడుతుండగా.. క్రియాశీల కేసుల రేటు 1.23 శాతనికి చేరింది. ఇక దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. 

ఆదివారం 25.23 లక్షల మందికి టీకాలు వేశారు. ఇప్పటివరకు 68.75కోట్ల డోసులను పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ గణాంకాలు వెల్లడించాయి. మరోవైపు కరోనా ఉద్దృతి నుంచి దక్షిణాది రాష్ట్రం కేరళ ఇంకా బయటపడట్లేదు. దేశవ్యాప్తంగా వైరస్ వ్యాప్తి కాస్త కట్టడిలోనే ఉన్నప్పటికీ ఇక్కడ మాత్రం కేసుల సంఖ్య ఎక్కువగానే ఉంటోంది. 

ఆదివారం ఈ రాష్ట్రంలో 26,701 కేసులు బయటపడగా, 74మంది కరోనాతో మరణించినట్లు కేరళ ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీనికి తోడు కేరళలో మళ్లీ నిఫా వైరస్ కూడా కలకలం రేపుతోంది.

PREV
click me!

Recommended Stories

Republic Day Parade: ఘనంగా గణతంత్ర దినోత్సవ పరేడ్ సన్నాహాలు| Asianet News Telugu
Fresh Snowfall in Shimla Delights Tourists: రికార్డు స్థాయిలో సిమ్లాలో మంచు వర్షం| Asianet Telugu