భర్త జైలుకి వెళ్లాడని.. భార్యకు రెండో పెళ్లి.. తిరిగి వచ్చాక..!

Published : Sep 06, 2021, 09:59 AM IST
భర్త జైలుకి వెళ్లాడని.. భార్యకు రెండో పెళ్లి.. తిరిగి వచ్చాక..!

సారాంశం

తన భార్యకు పెళ్లి చేసిన ఆమె అత్తపై కోపం పెంచుకొని  ఆమెను చంపేశాడు. 


ఓ వ్యక్తి నేరం చేసి జైలుకి వెళ్లాడు. అతను  మళ్లీ తిరిగిరాడేమోనని.. అతని భార్యకు మరో పెళ్లి చేశారు. అతను జైలు నుంచి తిరిగి వచ్చే సరికి భార్యకు పెళ్లి జరిగి ఉండటం.. అందులోనూ ఆమె గర్భవతిగా ఉండటం చేసి అతను షాకయ్యాడు. తన భార్యకు పెళ్లి చేసిన ఆమె అత్తపై కోపం పెంచుకొని  ఆమెను చంపేశాడు. ఈ సంఘటన ముంబయిలో చోటుచేసుకోగా... ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

అబ్బాస్‌ షేక్‌పై ముంబైలోని వివిధ పోలీస్‌ స్టేషన్లలో మొత్తం 28 కేసులు నమోదయ్యాయి. బుధవారం పూణేలోని ఎరవాడ జైలు నుంచి విడుదలైన షేక్‌ తన భార్యను వెతుకుంటూ అత్త షమల్‌ శ్యామ్‌ శిగామ్‌ ఇంటికి వెళ్లాడు. శిగామ్‌(61) తన కుమార్తెకు మళ్లీ వివాహం జరిగిందని, ఆమె ప్రస్తుతం గర్భవతని తెలిపింది.

దీంతో కోపోద్రిక్తుడై అత్త శిగామ్‌పై అబ్బాస్‌ షేక్‌ విచక్షణారహితంగా దాడి చేశాడు. పార, కత్తితో దాడి చేయడంతో తీవ్ర రక్తస్రావమైన శిగామ్‌ అక్కడిక్కడే మృతి చెందింది. దీనిపై దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించగా..  శిగామ్‌ను కలుసుకోవడానికి అబ్బాస్‌ షేక్‌  వెళ్లినట్లు గుర్తించారు. ఈ ఘటనపై షేక్‌ స్నేహితులను విచారించగా.. అతడు పూణేలో ఉన్నట్లు తెలిసిందని పోలీసులు పేర్కొన్నారు. అక్కడ అతడిని అరెస్టు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.

PREV
click me!

Recommended Stories

Census 2027: 30 లక్షల మంది సిబ్బంది, రూ. 11,718 కోట్లు.. ప్రపంచంలోనే అతిపెద్ద ఫీల్డ్ ఆపరేషన్‌గా జ‌న‌గ‌ణ‌న‌
Prada: ఈ చెప్పుల ధ‌ర అక్ష‌రాల రూ. 85 వేలు.. కొల్హాపురి కళాకారులతో ఇటాలియ‌న్ కంపెనీ ఒప్పందం