న్యాయస్థానాల్లో దోషులకు జరిమానాలు... కేరళకు సాయాలు

By sivanagaprasad KodatiFirst Published Aug 28, 2018, 5:32 PM IST
Highlights

గతంలో ఎన్నడూ లేని విధంగా భారీ వర్షాలు, వరదలతో తీవ్రంగా నష్టపోయిన కేరళకు ఎంతోమంది దాతలు, స్వచ్చంద సంస్థలు విరాళాలు ప్రకటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ కోవలో దేశంలోని న్యాయస్థానాలు కేరళను విభిన్నంగా ఆదుకుంటున్నాయి. 

అవినీతి కేసులో నిందితులైన ముగ్గురు వ్యక్తులను తలో రూ.15 వేల చొప్పున రూ.45 వేల జరిమానాను విధించింది.. దీనిని కేరళ సీఎం సహాయనిధికి చెల్లించాల్సిందిగా పంజాబ్‌లోని పంచకుల సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం న్యాయమూర్తి ఆదేశించారు. ఇదే తరహా తీర్పును ఝార్ఖండ్ హైకోర్టు కూడా అనుసరించింది.

ఒక కేసులో ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్న ముగ్గురి పిటిషన్లను కోర్టు అంగీకరించింది.. అయితే బెయిల్ కోసం పూచీకత్తుగా డిపాజిట్ చేయాల్సిన డబ్బును కేరళ ముఖ్యమంత్రి సహాయనిధి ఖాతాలో జమ చేయాలని ఆదేశించింది.

చీటింగ్, ఫోర్జరి సంతకం కేసులో నిందితుడిగా ఉన్న ఉత్పల్ రాయ్‌ని రూ.7 వేలు, మోసం కేసుల్లో నిందితులుగా ఉన్న మరో ఇద్దరు నిందితులను చెరో రూ. 5 వేలు చెల్లించాలని హైకోర్టు ఆదేశించింది. అలాగే మధ్యప్రదేశ్, కర్ణాటకల్లోని పలు న్యాయస్ధానాలు కూడా ఇదే తరహా నిర్ణయాలను ప్రకటించాయి.

click me!