కరుణానిధి మృతి..ప్రోటోకాల్ మెలిక పెట్టిన పళని ప్రభుత్వం

First Published Aug 8, 2018, 8:54 AM IST
Highlights

మొదట ఈ విషయంలో మొండికేసిన తమిళనాడు ప్రభుత్వం.. హైకోర్టు తీర్పుతో దిగిరావాల్సి వచ్చింది.
 

డీఎంకె చీఫ్, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి అంత్యక్రియలపై సందిగ్ధత ఇంకా కొనసాగుతూనే ఉంది.  ఈ విషయంపై హైకోర్టు బుధవారం ఉదయం వాదోప వాదనలు కొనసాగుతున్నాయి. మెరీనాబీచ్ లో అంత్యక్రియలు జరగకుండా ఉండేందుకు తమిళనాడు ప్రభుత్వం విశ్వ ప్రయత్నాలు చేస్తోంది.

గతంలో మెరినీ బీచ్ లో స్మారకాలపై ట్రాఫిక్ రామస్వామి పిటిషన్ దాఖలు చేశారు. కాగా.. ఈ విషయంపై చీఫ్ జస్టిస్ రామస్వామితో మాట్లాడారు. దీంతో ఆ పిటిషన్ ని రామస్వామి వెనక్కి తీసుకున్నారు. కరుణా నిధి అంత్యక్రియలు మెరీనా బీచ్ లో నిర్వహించడం పట్ల తనకు ఎలాంటి అభ్యంతరం లేదని రాతపూర్వకంగా ట్రాఫిక్ రామస్వామి న్యాయస్థానానికి అందజేశారు. రామస్వామి పిటిషన్ తోపాటు, అన్ని పిటిషన్లను న్యాయస్థానం డిస్ మిస్ చేసింది. దీంతో ఇప్పటి పవరకు ఉన్న ఆటంకాలు తొలగిపోయాయి అని అందరూ భావించారు. మరికాసేపట్లో దీనిపై స్పష్టత వస్తుందని అంతా అనుకున్నారు.

ఈలోగా పళని ప్రభుత్వం మరో మెళిక పెట్టింది. ప్రోటోకాల్ మెళిక పెట్టి.. మెరీనా బీచ్ లో ఆయన అంత్యక్రియలు జరగకుండా ఉండేలా చేయాలనుకుంటోంది. కరుణా నిధి గతంలో ముఖ్యమంత్రి కావొచ్చు.. కానీ ప్రస్తుతం ఆయన సీఎం పదవిలో లేరు కదా.. కాబట్టి ఆయనకు మెరీనా బీచ్ లో నే అంత్యక్రియలు నిర్వహించాలనే ప్రోటోకాల్ ఎలా వర్తిస్తుందని ప్రభుత్వం ప్రశ్నించింది. దీంతో మరోసారి దీనిపై సందిగ్ధత నెలకొంది.

చెన్నైలోని మేరీనాబీచ్ లో కరుణానిధి అంత్యక్రియలు నిర్వహించాలని కరుణానిధి కుటుంబసభ్యులు భావిస్తున్నారు. ఈ మేరకు అనుమతివ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. అన్నాదురై సమాధి పక్కనే కరుణానిధి అంత్యక్రియల నిర్వహణకు సహకరించాలని ప్రభుత్వాన్ని కోరారు.

అయితే మేరీనాబీచ్ లో అంత్యక్రియల నిర్వహణకు తమిళనాడు సర్కార్ అంగీకరించలేదు. గాంధీ మండపం వద్ద అంత్యక్రియల నిర్వహణకు అంగీకరించింది. ఈ మేరకు రెండు ఎకరాల స్థలాన్ని కేటాయించింది.

దీంతో మద్రాస్ హైకోర్టులో డీఎంకె పిటిషన్ దాఖలు చేసింది.ఈ పిటిషన్ పై మద్రాస్ హైకోర్టు చీఫ్ జస్టిస్ తో పాటు మరో జడ్జి విచారణ జరిపారు. బుధవారం తెల్లవారుజాము వరకు వాదనలు జరిగాయి.

మంగళవారం రాత్రి పదిన్నర గంటలకు డీఎంకె పిటిషన్ పై మద్రాస్ హైకోర్టు విచారణను చేపట్టింది. బుధవారం తెల్లవారుజాము వరకు వాదనలు జరిగాయి. తమిళనాడు రాష్ట్ర అడ్వకేట్ జనరల్ అందుబాటులో లేకపోవడంతో సుప్రీంకోర్టు సీనియర్ అడ్వకేట్ వైద్యనాథన్ రాష్ట్ర ప్రభుత్వం తరుపున కోర్టులో వాదనలను విన్పించారు.

మేరీనాబీచ్ లో అంత్యక్రియల నిర్వహణ వల్ల పర్యావరణానికి విఘాతం కలిగే అవకాశం ఉందని ప్రభుత్వం అబిప్రాయపడింది.కోర్టులో వాదోపవాదనలు ఇంకా కొనసాగుతున్నాయి.

click me!