ఢిల్లీ లిక్కర్ స్కాం: మనీష్ సిసోడియాకు ఐదు రోజుల ఈడీ కస్టడీ పొడిగింపు

By narsimha lodeFirst Published Mar 17, 2023, 4:08 PM IST
Highlights

ఢిల్లీ లిక్కర్ స్కాంలో  మనీష్  సిసోడియా  కు ఈడీ కస్టడీని  ఐదు  రోజుల పాటు  పొడిగించింది  కోర్టు. 

న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కాంలో  మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకు మరో  ఐదు  రోజుల పాటు ఈడీ కస్టడీని పొడిగించింది.  ఈ మేరకు  శుక్రవారంనాడు  కోర్టు ఆదేశాలు  జారీ  చేసింది. 

ఢిల్లీ లిక్కర్ స్కాంలో  మనీష్ సిసోడియాకు  చెందిన  మొబైల్ ఫోన్,  ఈ మెయిల్  డేటాను  ఫోరెన్సిక్  నిపుణులు  విశ్లేషించాల్సిన  అవసరం  ఉందని  ఈడీ న్యాయవాది  కోర్టుకు తెలిపారు. మరో వైపు ఇతరులతో  కలిపి  మనీష్  సిసోడియాను విచారించాల్సిన  అవసరం ఉందని  ఈడీ  న్యాయవాది  కోర్టును కోరారు. 

మనీష్ సిసోడియా  లిక్కర్ స్కాం  సమయంలో  14 ఫోన్లను  ధ్వంసం  చేశారని  ఈడీ  ఆరోపించింది. తాము  ఒక్క ఫోన్  ను మాత్రమే సీజ్  చేశామని  ఈడీ  తరపు న్యాయవాది కోర్టుకు  తెలిపారు.  ఢిల్లీ లిక్కర్ స్కాంలో  మనీష్ సిసోడియా  కీలక వ్యక్తి  అని ఈడీ  ఆరోపించింది.  మనీష్  సిసోడియాను  మరో నలుగురితో  కలిపి  విచారించాల్సిన  అవసరం ఉందని  ఈడీ అధికారులు  కోర్టుకు తెలిపారు. 

గత ఏడాది  నుండి  ఢిల్లీ లిక్కర్ స్కాంలో  మనీష్ సిసోడియాను  విచారిస్తున్నప్పటికీ  ఆయన ఉపయోగించిన  ఫోన్లు  లబ్యం కాలేదని  ఈడీ తరపు న్యాయవాది  కోర్టుకు తెలిపారు.  అంతేదక  మనీష్ సిసోడియా  ఢిల్లీ లిక్కర్ స్కాంలో  సౌత్ గ్రూప్ నకు ప్రయోజనం కలిగించేలా  వ్యవహరించారని  దర్యాప్తు  సంస్థలు  ఆరోపిస్తున్నాయి.  ఈ విషయమై  టెక్నికల్ ఆధారాలను  మరిన్ని  సేకరించాల్సిన  అవసరం ఉందని  ఈడీ తరపు న్యాయవాది  కోర్టుకు తెలిపారు. 

click me!