ఢిల్లీ లిక్కర్ స్కాం లో మనీష్ సిసోడియా కస్టడీ పొడిగింపు: తీర్పు రిజర్వ్ చేసిన కోర్టు

By narsimha lodeFirst Published Mar 17, 2023, 3:33 PM IST
Highlights

ఢిల్లీ లిక్కర్ స్కాంలో  ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం  మనీష్ సిసోడియాఈడీ కస్టడీ పొడిగింపుపై  తీర్పును  రిజర్వ్  చేసింది  కోర్టు. 

న్యూఢిల్లీ:  ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా  ఈడీ కస్టడీ పొడిగింపుపై  తీర్పును ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు  రిజర్వ్ చేసింది.  ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా  కస్టడీని  మరో ఏడు రోజుల పాటు పొడిగించాలని  ఈడీ అధికారులు కోర్టును  కోరారు.

 మనీష్ సిసోడియా తన పోన్  ను ధ్వంసం  చేశారని  ఈడీ తరపు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు.  మరో వైపు  మనీష్ సిసోడియాకు  కస్టడీ పొడిగించడాన్ని  ఆయన  తరపు న్యాయవాది వ్యతిరేకించారు.  ఢిల్లీ లిక్కర్ స్కాంపై  ఫిర్యాదు అందగానే  మనీష్ సిసోడియా  తన  ఫోన్ ను మార్చారని దర్యాప్తు సంస్థలు  ఆరోపిస్తున్నాయి. 

సీబీఐ కూడా ఇదే తరహ వాదనలు  చేసిందని  మనీష్ సిసోడియా తరపు న్యాయవాది  కోర్టుకు  తెలిపారు గత  ఏడు రోజుల్లో  మనీష్ సిసోడియాను  12 నుండి  13 గంటల పాటు మాత్రేమ విచారించారని సిసోడియా న్యాయవాది  గుర్తు  చేశారు. ప్రతి రోజూ  మనీష్ సిసోడియాను  ఐదు నుండి  ఆరు గంటల పాటు  విచారించామని  ఈడీ అధికారులు  కోర్టుకు  తెలిపారు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో  ఈ ఏడాది ఫిబ్రవరి 26న  మనీష్ సిసోడియాను  సీబీఐ అధికారులు అరస్ట్  చేశారు. 
 

click me!