28 ఏళ్ల తర్వాత భార్యాభర్తల అపూర్వ కలయిక

Published : Oct 08, 2018, 01:20 PM IST
28 ఏళ్ల తర్వాత  భార్యాభర్తల అపూర్వ కలయిక

సారాంశం

28 ఏళ్ల  తర్వాత  తన భార్యను కలుసుకొన్నాడు ఓ భర్త. ఓ కేసులో శిక్షను అనుభవిస్తున్న  సుబ్రమణియన్‌కు రాష్ట్ర ప్రభుత్వం క్షమాభిక్ష ప్రసాదించడంతో వృద్ధాశ్రమంలో ఆశ్రయం పొందుతున్న తన భార్యను  కలుసుకొన్నాడు


చెన్నై: 28 ఏళ్ల  తర్వాత  తన భార్యను కలుసుకొన్నాడు ఓ భర్త. ఓ కేసులో శిక్షను అనుభవిస్తున్న  సుబ్రమణియన్‌కు రాష్ట్ర ప్రభుత్వం క్షమాభిక్ష ప్రసాదించడంతో వృద్ధాశ్రమంలో ఆశ్రయం పొందుతున్న తన భార్యను  కలుసుకొన్నాడు. ఈ ఘటన తమిళనాడు రాష్ట్రంలో చోటు చేసుకొంది.

శ్రీలంకకు చెందిన బక్కర్ అలియాస్ విజయ  తమిళుల వైరుధ్యం సమయంలో తమిళనాడుకు చేరుకొంది వీధుల్లో నాట్యం చేస్తూ జీవనం సాగించేది.  విజయ నాట్యానికి  సుబ్రమణియం ఆకర్షితుడయ్యాడు.ఆమెను ప్రేమించాడు.  సుబ్రమణియం ఇంట్లో ఈ ప్రేమను అంగీకరించలేదు.

దీంతో సుబ్రమణియం 1985లో విజయను వివాహం చేసుకొన్నాడు.  ఆ తర్వాత కూడ వీరిద్దరూ  వీధుల్లో నాట్యం చేస్తూ జీవనం సాగించేవారు.  రాత్రి వేళల్లో రోడ్డు పక్కన  నిద్రిస్తుండేవారు.

అయితే ఈ సమయంలో  ఓ వ్యక్తి విజయపై  అత్యాచారానికి ప్రయత్నించాడు. దీంతో సుబ్రమణియన్  ఆగ్రహంతో అతనిపై దాడి చేయడంతో తలకు తీవ్ర గాయమై అక్కడికక్కడే మృతి చెందాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు. 

ఈ కేసులో సుబ్రమణియన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. 1990లో కోవై కోర్టు  సుబ్రమణియన్‌కు జీవిత శిక్ష విధించింది.  వేలూరు మహిళా జైల్లో  విజయను, పురుషుల జైల్లో సుబ్రమణియన్ ను ఉంచారు. జైల్లో విజయకు  అనారోగ్యంతో మాట పడిపోయింది. 
 

PREV
click me!

Recommended Stories

మహిళల కోసం వన్ స్టాప్ సెంటర్లు.. వీటివల్ల లాభాలేంటో తెలుసా?
Top 5 Dirtiest Railway Stations : దేశంలోనే అత్యంత మురికి రైల్వే స్టేషన్ ఏదో తెలుసా?