దంపతుల దారుణ హత్య.. రక్తపు మడుగులో మృతదేహాలు..

Published : Nov 05, 2020, 03:14 PM IST
దంపతుల దారుణ హత్య.. రక్తపు మడుగులో మృతదేహాలు..

సారాంశం

గ్రెటర్‌ నోయిడాలో దంపతుల జంట హత్యలు స్థానికంగా కలకలం రేపాయి. చెర్రి కౌంటీ సొసైటీ తొమ్మిదో అంతస్తులో నివాసం ఉంటున్న భార్యభర్తల హత్య కేసు స్థానికుల్లో ఆందోళన కలిగిస్తోంది. వీరు కిరాణా షాప్‌ యజమాని అతని భార్యగా గుర్తించారు. రక్తపు మడుగులో కనిపించడంతో చెర్రీ కౌంటీలో విషాదం చోటుచేసుకుంది. 

బుధవారం బిస్రఖ్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో జరిగిన ఈ ఘటనను అనుమానాస్పద కేసుగా పోలీసులు నమోదు చేశారు. మృతులు వినయ్‌ గుప్త(50), నేహా గుప్తలుగా గుర్తించారు.

కొన్ని నెలలుగా కిరాణా షాప్‌ నడుపుతూ ఈ ప్లాట్‌లో ఉంటున్నారని అడిషనల్‌ కమిషనర్‌ ఆఫ్‌ పోలీస్‌ లవ్‌ కుమార్‌ తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, హత్య వెనుకాల దంపతులకు తెలిసిన వారి హస్తం ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు.

స్థానిక పోలీస్‌ స్టేషన్‌, స్పేషల్‌ ఆపరేషన్స్‌ గ్రూప్‌, ఫోరెన్సిక్‌, సర్‌వేలైన్స్‌ విభాగం అధికారులు ఘటనా స్థలాన్ని పరిశీలించారని, డాగ్‌ స్వ్కాడ్‌‌ సేవలు కూడా తీసుకుంటున్నామని ఏసీపీ అన్నారు. 

అడిషనల్‌ కమిషనర్‌ కుమార్‌ విలేకరులతో మట్లాడుతూ.. ‘దోపిడి చేసే ఉద్దేశ్యంతో ఈ హత్యకు పాల్పడినట్లు కనిపించడంలేదు. ఇంట్లోని వస్తువులు ఎక్కడాకూడా చెల్లాచెదురుగా పడిలేవు. బలవంతంగా ఇంట్లోకి ప్రవేశించినట్టు ఏ విధమైన ఆనవాలు కనిపించలేదు. వీరికి తెలిసిన వారే ఇంటిలోని బలమైన వస్తువులను ఉపయోగించి హతమార్చి ఉంటారని భావిస్తున్నామ’న్నారు.
 
PREV
click me!

Recommended Stories

IRCTC Char Dham Yatra: కేదార్‌నాథ్, బద్రీనాథ్ పుణ్యక్షేత్రాల దర్శనంతో ఐఆర్‌సీటీసీ చార్ ధామ్ యాత్ర క్రేజీ ప్యాకేజీ.. పూర్తి వివరాలు ఇవే !
జపాన్ ప్రధాని కి భారత్ స్టైల్ ల్లో అదిరిపోయే వెల్ కమ్ | PM Modi Welcomes Japanese PM Sanae Takaichi