ఆంటీ అని పిలిచినందుకు.. జుట్టు పట్టుకుని చితగ్గొట్టింది..

Bukka Sumabala   | Asianet News
Published : Nov 05, 2020, 11:00 AM IST
ఆంటీ అని పిలిచినందుకు.. జుట్టు పట్టుకుని చితగ్గొట్టింది..

సారాంశం

ఆంటీ అని పిలిచినందుకు ఓ అమ్మాయి జుట్టు కోసినంత పనిచేసిందో మహిళ. ఉత్తర ప్రదేశ్ లోని ఈటాలో జరిగిన ఈ సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

ఆంటీ అని పిలిచినందుకు ఓ అమ్మాయి జుట్టు కోసినంత పనిచేసిందో మహిళ. ఉత్తర ప్రదేశ్ లోని ఈటాలో జరిగిన ఈ సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

ఇంతకూ విషయం ఏంటంటే.. ఈ మధ్య కాలంలో తమకంటే వయసులో నాలుగైదేళ్లు ఎక్కువుంటే చాలు మహిళల్ని ఆంటీ అనేస్తున్నారు. ఇక మగవాళ్లైతే మరీ ఘోరం. చీర కట్టుకుంటే చాలు వయసులో చిన్నదైనా, పెద్దదైనా సరే ఆంటీ అంటూ పిలుపు. ఇది వినడానికి ఎంత విసుగ్గా ఉంటుందో తెలిపే ఘటన ఇది.

ఈటాలోని బాబూగంజ్ మార్కెట్‌లో కొంద‌రు మ‌హిళ‌లు షాపింగ్ చేస్తున్నారు. పక్కనే షాపింగ్ చేస్తున్న మరో అమ్మాయి.. వీరిలోని ఓ మహిళను ఆంటీ అని పిలిచింది. అంతే ఆ మహిళ శివాలెత్తి పోయింది. ఆంటీ ఎవరు? ఆంటీ అని పిలుస్తావా? అంటూ దాడికి దిగింది. జుట్టుపట్టుకుని వీరబాదుడు బాదింది.

దీనికి ఆమెతో ఉన్న మహిళలు కూడా సాయం చేశారు. ఈ గొడవ గమనించిన ఓ మహిళా పోలీసు అడ్డుకోవడంతో గొడవ సద్దుమణిగింది. పాపం ఆంటీ అని పిలిపించుకున్న ఆ మహిళ ఆ పిలుపుతో ఎంత విసిగిపోయిందో మరి.. 

ఈ గొడవనంత అక్కడే ఉన్న ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇంకేముంది ఇది కాస్తా వైరల్ గా మారింది. సో అమ్మాయిలు కానీ, అబ్బాయిలు కానీ, అంకుల్స్ కానీ.. ఆంటీ అని పిలిచేముందు ఒకటికి రెండుసార్లు బాగా ఆలోచించుకోండి మరి. 

PREV
click me!

Recommended Stories

IRCTC New Rates: టికెట్ ధరలు పెంచిన రైల్వే.. హైదరాబాద్ నుంచి వైజాగ్, తిరుపతికి రేట్లు ఇవే !
Success Story: సెక్యూరిటీ గార్డు కొడుకు.. 3 కంపెనీలకు బాస్ ! ఇది కదా సక్సెస్ స్టోరీ అంటే !