రైళ్లలో ట్రాలీ బ్యాగ్‌లే టార్గెట్.. జంటను పట్టుకున్న మధ్యప్రదేశ్ జీఆర్పీ పోలీసులు

Siva Kodati |  
Published : Aug 15, 2023, 02:25 PM IST
రైళ్లలో ట్రాలీ బ్యాగ్‌లే టార్గెట్.. జంటను పట్టుకున్న మధ్యప్రదేశ్ జీఆర్పీ పోలీసులు

సారాంశం

రైళ్లలో ట్రాలీ బ్యాగ్‌లను దొంగిలిస్తోన్న జంటను మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ప్రభుత్వ రైల్వే పోలీసులు అరెస్ట్ చేశారు.  పోలీసులు నిందితులైన పూజా వర్మ, ఆమె పార్ట్‌నర్ రాజ్ కుమార్ యాదవ్‌లను అరెస్ట్ చేశారు. 

రైళ్లలో ట్రాలీ బ్యాగ్‌లను దొంగిలిస్తోన్న జంటను మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ప్రభుత్వ రైల్వే పోలీసులు అరెస్ట్ చేశారు. అహల్య నగరి ఎక్స్‌ప్రెస్‌లో ఇద్దరు సహచరుల సాయంతో ట్రాలీ బ్యాగులను వీరు దొంగిలించారు. వీటిలోని ఒక బ్యాగులో లక్షల విలువ చేసే లివర్ టెస్టింగ్ మిషన్ కూడా వున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. దీనిపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు ఓ మహిళ తన సహచరుడితో కలిసి స్కూటర్‌పై ట్రాలీ బ్యాగ్‌ను తీసుకెళ్లినట్లు సీసీటీవీ ఫుటేజ్‌లో రికార్డ్ అయ్యింది. దీంతో పోలీసులు నిందితులైన పూజా వర్మ, ఆమె పార్ట్‌నర్ రాజ్ కుమార్ యాదవ్‌లను అరెస్ట్ చేశారు. వీరిద్దరూ తమ నేరాన్ని అంగీకరించినట్లుగా పోలీసులు తెలిపారు. 

వీరి వద్ద నుంచి దొంగిలించబడిన ఇతర వస్తువులతో పాటు కాలేయ పరీక్ష యంత్రాన్ని స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు వీరికి సహకరించిన మరో ఇద్దరు వ్యక్తుల కోసం జీఆర్పీ పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. ఈ ఘటనపై రైల్వే అధికారులు మీడియాతో మాట్లాడుతూ.. నిందితులు గత కొద్దిరోజులుగా ట్రాలీ బ్యాగ్‌లను లక్ష్యంగా చేసుకుంటున్నారు. గతంలో ఇలాంటి నాలుగు సంఘటనలలో వీరి ప్రమేయం వున్నట్లుగా వారు తెలిపారు. 


 

PREV
click me!

Recommended Stories

Viral News: పెరుగుతోన్న విడాకులు.. ఇకపై పెళ్లిళ్లు చేయకూడదని పండితుల నిర్ణయం
Recharge Price Hike : న్యూఇయర్ లో మీ ఫోన్ మెయింటెనెన్స్ మరింత కాస్ట్లీ.. మొబైల్ రీచార్జ్ ధరలు పెంపు..?