స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో అపశృతి.. జెండా ఎగురవేసిన వెంటనే కుప్పకూలిన మధ్యప్రదేశ్ ఆరోగ్య శాఖ మంత్రి..

Published : Aug 15, 2023, 01:56 PM IST
స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో అపశృతి.. జెండా ఎగురవేసిన వెంటనే కుప్పకూలిన మధ్యప్రదేశ్ ఆరోగ్య శాఖ మంత్రి..

సారాంశం

మధ్యప్రదేశ్ లోని రైసేన్ జిల్లాలో ఉన్న హోంగార్డు ప్రధాన కార్యాలయంలో జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి ప్రభురామ్ చౌదరి హాజరయ్యారు. త్రివర్ణ పతాకానికి సెల్యూట్ చేసిన కొన్ని సెకన్ల తరువాత ఆయన కుప్పకూలిపోయాడు. వెంటనే మంత్రిని హాస్పిటల్ కు తరలించారు.

మధ్యప్రదేశ్ లో నిర్వహించిన స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో అపశృతి చోటుచేసుకుంది. ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి ప్రభురామ్ చౌదరి మంగళవారం రైసేన్ లో జెండా ఎగురవేసిన కొన్ని క్షణాల్లోనే వేదికపై కుప్పకూలిపోయారు. ఆపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. దీంతో అక్కడున్న పోలీసులు, ఇతర సిబ్బంది, నాయకులు అలెర్ట్ అయ్యారు. వెంటనే ఆయనను హాస్పిటల్ కు తరలించారు. 

‘ఇండియా టీవీ’ కథనం ప్రకారం.. రైసేన్ జిల్లాలోని హోంగార్డు ప్రధాన కార్యాలయంలో  జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ కార్యక్రమానికి ఆరోగ్య శాఖ మంత్రి ప్రభురామ్ చౌదరి హాజరయ్యారు. అక్కడి పోలీసు ఉన్నతాధికారులతో కలిసి జాతీయ జెండా ఎగురవేశారు. అనంతరం త్రివర్ణ పతాకాన్ని ఎగురేశారు. సిబ్బంది జాతీయ గీతాన్ని ఆలపించారు. అది ముగిసిన కొంత సమయం తరువాత కొన్ని సెకన్లకే మంత్రి హఠాత్తుగా కిందపడిపోయారు.

దీంతో పక్కనే ఉన్న పోలీసు ఉన్నతాధికారులు, ఇతర సిబ్బంది అప్రమత్తమయ్యారు. ఆయనను ఎత్తుకొని అక్కడే ఉన్న అంబులెన్స్ లో ఎక్కించారు. దాని ద్వారా భోపాల్ లోని ఓ హాస్పిటల్ కు తరలించారు. అయితే మంత్రికి రక్తపోటు ఎక్కువగా ఉండి షుగర్ లెవల్స్ తగ్గి ఉండొచ్చని ఈ కార్యక్రమానికి హాజరైన వైద్యులు తెలిపారు. కాగా.. హాస్పిటల్ లో ఆయనకు ఎలక్ట్రో కార్డియోగ్రఫీ (ఈసీజీ) తీశారు. అందులో కొన్ని మార్పులు కనిపించాయి. దీంతో గుండెపోటు వచ్చి ఉండొచ్చని వైద్యులు చెబుతున్నారు. 

ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.. 
 

PREV
click me!

Recommended Stories

Nitin Nabin : బీజేపీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా మోదీ నమ్మిన బంటు.. ఎవరీ నితిన్ నబిన్?
Indian Railways : ఇండియన్ రైల్వే బంపర్ ఆఫర్.. తక్కువ ఖర్చుతో దేశమంతా తిరిగేయండిలా !