వీడసలు భర్తేనా??... భార్యను నగ్నంగా వీడియో తీసి, తల్లిదండ్రులతో కలిసి బ్లాక్ మెయిల్...

Published : Aug 15, 2023, 01:22 PM IST
వీడసలు భర్తేనా??... భార్యను నగ్నంగా వీడియో తీసి, తల్లిదండ్రులతో కలిసి బ్లాక్ మెయిల్...

సారాంశం

భార్యను నగ్నంగా వీడియోతీసిన ఓ వ్యక్తి దాంతో ఆమెను బెదిరించడం మొదలుపెట్టాడు. దీనికి అతని తల్లిదండ్రులు, స్నేహితుడు అతనిభార్య, భర్త సోదరి సహకరించారు. 

తమిళనాడు : అగ్నిసాక్షిగా తాళి కట్టి అర్ధాంగిగా చేసుకున్న భార్య మీద ఓ భర్త అత్యంత అమానుషానికి ఒడిగట్టాడు. భార్యతో ఏకాంతంగా ఉన్న సమయంలో వీడియోలు తీసిన ఆ సదరు భర్త వాటితో భార్యను బెదిరించాడు. దీంతో అతనితో సహా అతని తల్లి, తండ్రితోపాటు  మొత్తం ఆరుగురి మీద పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటన తమిళనాడులో వెలుగు చూసింది.

దీనికి సంబంధించిన వివరాలలోకి వెళితే..  తమిళనాడు రాష్ట్రం మధురైలోని ముత్తుపట్టి కృష్ణానగర్ కు చెందిన రాజ్ కమలే ఈ దారుణానికి ఒడిగట్టిన వ్యక్తి. అతని భార్య ఈ విషయం మీద మధురై సౌత్ మహిళా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. తన భర్త తనను నగ్నంగా సెల్ఫోన్లో వీడియోలు తీశాడని చెప్పింది. దీనికి అతని స్నేహితులైన శరత్, అతని భార్య లిల్లీ, తల్లి రతి ప్రియ, తండ్రి పళని,  సోదరి రాజ్య తిలకం సహకరించారని ఆమె తన ఫిర్యాదులో పేర్కొంది.

‘‘అవును.. వచ్చే ఏడాది కూడా మోడీ జాతీయ జెండా ఎగురవేస్తారు.. కానీ’’ - కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే..

ఆ వీడియో చూపించి తనను బెదిరిస్తున్నారని.. ఫోన్ నుంచి వీడియో డిలీట్ చేయకుండా సోషల్ మీడియాలో పెడతానని బ్లాక్మెయిల్ చేస్తున్నారని వాపోయింది. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు..  భర్త కమలే,  అతని స్నేహితుడు శరత్,  స్నేహితుడు భార్య లిల్లీ,  తల్లిదండ్రులు రతిప్రియ, పళనిని  తీసుకున్నారు.  వీరిని  ప్రశ్నిస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

సంక్రాంతికి కిచిడీ మేళా.. ఈ ఆలయంలో విచిత్రమైన ఆచారం
Gold Rate : గూగుల్, న్యూస్ ధరలు కాదు.. రియల్ టైమ్ బంగారం రేటు కచ్చితంగా తెలుసుకోవడం ఎలాగంటే..