సీఏఏ ఎఫెక్ట్.. కస్టమర్ ని పోలీసులకు అప్పగించిన ఉబర్ డ్రైవర్

By telugu teamFirst Published Feb 7, 2020, 1:52 PM IST
Highlights

సర్కార్ క్యాబ్ లో తన స్నేహితుడితో మాట్లాడుతుండగా తాను రికార్డు చేశానని చెప్పి.. పోలీసుల చేత అతనిని అరెస్ట్ చేయించాడు. సర్కార్ ఓ కమ్యునిస్ట్ అంటూ.. దేశానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేయాలని అనుకుంటున్నాడని ఆ క్యాబ్ డ్రైవర్ ఆరోపించారు.  ఈ సంఘటన బుధవారం రాత్రి చోటుచేసుకుంది. 

తన క్యాబ్ లో ఎక్కిన ఓ కస్టమర్ ని.. ఉబర్ డ్రైవర్ పోలీసులకు అప్పగించాడు. ఈ సంఘటన ముంబయిలో చోటుచేసుకోగా.. దీనికి సంబంధించిన వార్త నెట్టింట ప్రస్తుతం వైరల్ గా మారింది.

పూర్తి వివరాల్లోకి వెళితే... ముంబయికి చెందిన  రచయిత బప్పడిట్టయ సర్కార్ జుహూలో రాత్రి 10గంటల 30 నిమిషాల సమయంలో కుర్రా వెళ్లడానికి కారు ఉబర్ క్యాబ్ ఎక్కారు. ఆయన క్యాబ్ లో తన స్నేహితుడితో మాట్లాడుతున్నాడు. సడెన్ గా క్యాబ్ డ్రైవర్ కారును ఆపేసి.. డబ్బులు డ్రా చేసుకుంటానని చెప్పి వెళ్లాడు. 

Also Read షహీన్ బాగ్ షూటర్... ఆప్ కార్యకర్తే : ఢిల్లీ పోలీసులు..

తర్వాత వచ్చి... ఇద్దరు పోలీసులను తీసుకువచ్చి... ఇతను సీఏఏకి వ్యతిరేకంగా ఆందోళన చేయడానికి వచ్చాడని అరెస్ట్ చేయాలంటూ పోలీసులకు చెప్పాడు. సర్కార్ క్యాబ్ లో తన స్నేహితుడితో మాట్లాడుతుండగా తాను రికార్డు చేశానని చెప్పి.. పోలీసుల చేత అతనిని అరెస్ట్ చేయించాడు. సర్కార్ ఓ కమ్యునిస్ట్ అంటూ.. దేశానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేయాలని అనుకుంటున్నాడని ఆ క్యాబ్ డ్రైవర్ ఆరోపించారు.  ఈ సంఘటన బుధవారం రాత్రి చోటుచేసుకుంది. 

అయితే.. తాను అలాంటి కామెంట్స్ చేయలేదని ఆ రచయిత ఎంత చెప్పినా వినిపించుకోకపోవడం గమనార్హం. కాగా.. తాను తన స్నేహితుడితో సరదాగా మాత్రమే మాట్లాడానని సీఏఏ( పౌరసత్వ సరవణ బిల్లు) కి వ్యతిరేకంగా ఏమీ మాట్లాడలేదని ఆ రచయిత వాపోయాడు. దీన్నంతటినీ ఆయన సోషల్ మీడియాలో కూడా పేర్కొన్నాడు.

కాగా... ఆ రచయితకు ఎదురైన ఓ అనుభవాన్ని యాక్టివిస్ట్  కవిత కృష్ణన్ అనే వ్యక్తి  సోషల్ మీడియాలో పోస్టు చేశారు.  ఓ రచయిత భయంకరమైన రాత్రిని చూశాడు అంటూ ఆమె ట్వీట్ చేశారు. దీంతో ఈ ఘటన వైరల్ గా మారింది. కొందరు ఆ డ్రైవర్ చేసిన దానిని పాజిటివ్ గా స్పందిస్తుంటే.. మరికొందరు నెగిటివ్ గా స్పందిస్తున్నారు. 

click me!