ఇండియాలో మళ్లీ పెరిగిన కరోనా మరణాలు... !

By AN TeluguFirst Published Jul 10, 2021, 9:37 AM IST
Highlights

గత 24 గంటల్లో కరోనావైరస్ కారణంగా 1,206 మరణాలు సంభవించాయి. దీంతో తగ్గుముఖం పట్టిన మరణాల సంఖ్యలో మళ్లీ పెరుగుదల కాస్త ఆందోళన కలిగిస్తోంది. 

దేశంలో కరోనా వ్యాప్తి మళ్లీ నెమ్మదిగా పుంజుకుంటోంది. గత కొద్ది రోజులుగా తగ్గుముఖం పట్టిన కేసులు, మరణాల సంఖ్యలో మళ్లీ పెరుగుదల కనిపిస్తోంది.  గత 24 గంటల్లో భారత్‌లో 43,393 కొత్త కేసులు నమోదయ్యాయి. 


గత 24 గంటల్లో కరోనావైరస్ కారణంగా 1,206 మరణాలు సంభవించాయి. దీంతో తగ్గుముఖం పట్టిన మరణాల సంఖ్యలో మళ్లీ పెరుగుదల కాస్త ఆందోళన కలిగిస్తోంది. 

దేశం యొక్క క్రియాశీల కేస్ లోడ్ ఇప్పుడు 4,58,727 వద్ద ఉంది, ఇది మొత్తం కేసులలో 1.49%. వరుసగా 18 రోజులకు రోజువారీ పాజిటివిటీ రేటు 3% కన్నా తక్కువ. 

అయితే కొన్ని రాష్ట్రాల్లో కేసుల సంఖ్యలో విపరీతమైన పెరుగుదల కనిపిస్తుంది. మహారాష్ట్రలోని పుణే, నాసిక్, అహ్మద్ నగర్, రత్నగిరి తదితర జిల్లాల్లో కేసుల సంఖ్య గణనీయంగా పెరిగింది. దాంతో ఆయా ప్రాంతాల్లో మళ్లీ కఠిన ఆంక్షలు విధించారు. కేరళతో పాటు, ఈశాన్య రాష్ట్రాల్లో సైతం కేసుల సంఖ్య తిరిగి పెరుగుతోంది. దీంతో కేంద్ర ప్రభుత్వం ఆరు రాష్ట్రాలకు ప్రత్యేక బృందాలను పంపించింది. 

ఇదిలా ఉంటే ఇప్పటికే రెండు దఫాలుగా జనజీవనాన్ని ఛిన్నాభిన్నం చేసి కోవిడ్ రక్కసి మూడోసారీ దాడి చేసే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇటీవల ‘గతానుభవాల ఆధారంగా’ చేసిన పరిశీలనలు, అధ్యయనాలు మూడోదశ వ్యాప్తి అనివార్యమనే అభిప్రాయాలను బలం చేకూరుస్తున్నాయి. కొవిడ్ మూడో దశ తప్పదని, అయితే అది ఎప్పుడు వచ్చేదీ చెప్పలేమని, దాన్ని ఎదుర్కొనేందుకు అందరూ సిద్దంగా ఉండాలని కేంద్ర ప్రభుత్వ ప్రధాన శాస్త్రీయ సలహాదారు కె. విజయరాఘవన్ సైతం గతంలో హెచ్చరించారు. 

click me!